వచ్చేది తెలంగాణానా- రాష్ట్రపతి పాలనా!



కాంగ్రెస్ నాయకులు తలో మాట మాట్లాడి ప్రజలను గందరగోళం చేయడంలో వారికి వారే దిట్టలు. ఒక నాయకుడు మూడు నెలల్లోతెలంగాణపై నిర్ణయం వస్తుందని ప్రకటిస్తే మరో నాయకుడు అక్టోబర్ ఇరవై ఆరు లోపల తెలంగాణ వస్తుందని అంటారు. వేరొక నాయకుడు తెలంగాణకు కాంగ్రెస్ మంత్రులే అడ్డు అని ప్రకటిస్తారు. ఇంకో నాయకుడు తెలంగాణ ఇవ్వకపోతే పదవులను వదలుకుంటామని హెచ్చరిస్తాడు. వేరొక నాయకుడు తెలంగాణ ఉద్యమం ఉధృతమైతే వచ్చేది రాష్ట్రపతి పాలనే అని హెచ్చరిస్తాడు..ఇవన్ని కొన్ని గంటల వ్యవధిలో కాంగ్రెస్ కు చెందిన నేతలు చేసిన ప్రకటనలు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడు నెలలలో తెలంగాణ సమస్యకు ఒక పరిష్కారాన్ని కేంద్రం ప్రకటించవచ్చని అన్నారు. కాని ఆయన మంత్రి వర్గ సభ్యుడు డాక్టర్ పి.శంకరరావు అక్టోబర్ ఇరవై ఆరులోగా తెలంగాణ వస్తుందని తేల్చేశారు. గతంలో ఈయనే అక్టోబర్ రెండు లోగా తెలంగాణ వస్తుందని అన్నారు. ఇప్పుడు మరో తేదీ చెబుతున్నారు. మాజీ మంత్రి జూపల్లె కృష్ణారావు, తన మాదిరి మిగిలిన నేతలు కూడా మాజీ మంత్రులు కావాలని చాలాకాలం నుంచి కోరుతున్నాడు.కాని ఆయన మాట ఎవరూ పట్టించుకోవడం లేదు. దాంతో ఆయన విసుగు చెందిన కృష్ణారావు తెలంగాణ రాకపోవడానికి ఆటంకం తెలంగాణ మంత్రులేనని స్పష్టం చేశారు. వారు రాజీనామాలు చేసి ఉంటే తెలంగాణ వచ్చేదని ఆయన సూత్రీకరిస్తున్నారు.ఇక కరీంనగర్ ఎమ్.పి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాకపోతే పదవులు వదలుకుంటామని హెచ్చరించారు. అంటే తెలంగాణ రావడం లేదన్న సంకేతం ఏమైనా ఈయనకు వచ్చిందా అన్న అనుమానం కలుగుతుంది.నిజామాబాద్ ఎమ్.పి మధుయాష్కి, నాగర్ కర్నూల్ ఎమ్.పి మందా జగన్నాధం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రకటనలు ఇచ్చారు. ఇక కోస్తా కు చెందిన గుంటూరు ఎమ్.పి రాయపాటి సాంబశివరావు తెలంగాణ రాదన్నట్లుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతమైతే రాష్ట్రపతి పాలన వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ రకంగా ఇందరు కాంగ్రెస్ నేతలు ఇన్ని రకాలుగా మాట్లాడి జనాన్ని నానా హింసకు గురి చేస్తున్నారు. ముందుగా వీరంతా ఒకచోట కూర్చుని ఒక నిర్దిష్ట అభిప్రాయానికి వస్తే అదే గొప్ప విషయం అవుతుంది.అదిఇప్పట్లో జరిగేలా లేదు.చివరికి తెలంగాణ వస్తుందా?రాష్ట్రపతి పాలన వస్తుందా అన్న ప్రశ్న ఇప్పట్లో తేలేలా లేదు. ఎందుకంటే తెలంగాణ ఆందోళనకారులు మరీ తీవ్రంగా వెళ్లకుండా,అ ప్పుడప్పుడు ఉద్యమాన్ని పెంచుతూ, మరొకొన్నాళ్లు హడావుడి చేయకుండా వ్యూహాత్మకంగా నడుపుతున్నారు. దీనివల్ల అటు రాష్ట్రపతి పాలన వచ్చే పరిస్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!