అపార్ట్ మెంట్స్ ఎందుకు కూలుతున్నాయి?


కాకినాడలోని శాంతినగర్ లోని శ్యామలాసదన్ ఆపార్ట్ మెంట్ మొదటి అంతస్థు భూమిలోకి కుంగిపోయింది. ముగ్గురు చిన్నారులు శిథిలాల కింద చిక్కుకున్నట్టు ప్రాధమిక సమాచారం. అది మిడిల్ క్లాస్ కాలనీ. జీవితంలో ఓ సొంత ఇళ్లు కట్టుకోవాలని తపించేవారే ఎక్కువ. అలాంటి వారికి బిల్డర్ నాసిరకం నిర్మాణంతో ఫ్లాట్స్ అప్పగించడం ఎంత మోసం. ఈ దేశం ఎటుపోతోంది…? అపార్ట్ మెంట్ కట్టించేటప్పుడు బిల్డర్ చెప్పే `తీపి’ కబుర్లకు మిడిల్ క్లాస్ బోల్తా పడిపోతోంది. అత్యద్భుతంగా అపార్ట్ మెంట్ కట్టిస్తామని బిల్డర్ నమ్మబలుకుతున్నాడు. మధ్యతరగతి వాళ్ల మనస్తత్వం ఎంత తక్కువకు ప్లాట్ వస్తుందా అని ఉంటుందే తప్ప, నాణ్యమైన అపార్ట్ మెంట్ ఇస్తున్నాడా, లేదా అని ఆలోచించడంలేదు. పదివేలో, లేదా పాతికవేలకో తక్కువగా ఇస్తామంటే, ఆ బిల్డర్ ను పూర్తిగా నమ్మేస్తుంటారు. దీంతో సరిగా సాయిల్ టెస్ట్ లు చేయించకుండా, పునాదలు సరిగా వేయకుండానే నాసిరకంగా బిల్డింగ్ కట్టించేసి బిల్డర్ చేతులు దులుపుకుంటున్నాడు. కొస్తా ఆంధ్రలో సముద్రం పక్కన ఉండే శాండ్ శాయిల్ కు తగ్గట్టుగా తీసుకోవాల్సిన ఇంజనీరింగ్ సూచనలను, సలహాలను బిల్డర్లు పాటించడంలేదు. ఫలితంగా, అపార్ట్ మెంట్స్ కూలిపోతున్నాయి. లేదంటే క్రుంగిపోతున్నాయి. మరి ఈ నేరం ఎవరిది? ఓసారి ఆలోచించండి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!