బొగ్గుగ‌నుల‌కి స‌.జ‌. స‌మ్మె దెబ్బ‌


ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం రాజకీయ ఐకాస చేపట్టిన సకల జనుల సమ్మె నేటితో మూడ‌వ‌రోజుకు చేరుకుంది. ఈ స‌మ్మె ప్ర‌భావం తెలంగాణ జిల్లాల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ బొగ్గు గ‌నుల‌పై మాత్రం చాలా తీవ్రంగా ఉంది. సింగరేణిలో సకల జనుల సమ్మె కార‌ణంగా వేలాది మంది కార్మికులు విధులను బహిష్కరించడంతో సింగరేణి వ్యాప్తంగా రూ.100 కోట్ల నష్టం వాటిల్లింది. బొగ్గు ఉత్పత్తులు నిలిచిపోవడంతో వీటిపై ఆధార పడ్డ చిన్నపరిశ్రమలకు గడ్డుకాలం ఏర్పడింది. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లా సింగరేణిలోనూ సమ్మె కొనసాగుతోంది. 26 వేల మంది కార్మికులు విధులకు గైర్హాజరయ్యారు. 17 భూగర్భ, 4 ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కాగా స‌క‌ల‌జ‌నుల స‌మ్మెలో భాగంగా  నేడు తరగతుల బహిష్కరణకు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. మ‌రోవైపు స‌క‌ల జ‌నుల స‌మ్మెలో పాల్గొన్న ఉద్యోగుల‌పై ప్ర‌భుత్వం ఎస్మా ప్ర‌యోగించ‌డానికి తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!