అమెరికావెళ్ళి రిలీఫ్ కానున్న మంత్రి


రాష్ట్రంలో తెలంగాణ మంత్రులు చాలా చిక్కులలో ఉన్నారు. అటు పదవిని కాదనలేక, ఇటు తెలంగాణ ఆందోళనకా రులను ఔనన లేక సతమతమవుతున్నారు. అందువల్ల వీలైనప్పుడల్లా కొందరు మంత్రులు రాష్ట్రానికి దూరంగా వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. కొంతకాలం క్రితం ఆరోగ్య కారణాల రీత్యా మంత్రి జానారెడ్డి కేరళ వెళ్లి వచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ఐటి, దేవాదాయ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అమెరికా వెళుతున్నారు. ఆయనకు అర్కన్సాస్ యూనివర్శిటీలో వచ్చే నెలలో సన్మానం జరగబోతోంది. ఆయన అక్కడ చాలా కాలం ఉన్నారు. ఆ తర్వాత 1989లో జనగామ నుంచి పోటీచేసి గెలుపొందారు. అప్పటి నుంచి మరో మూడుసార్లుగెలిచారు. ఈసారి అనూహ్యంగా తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో అది పొన్నాల లక్ష్మయ్యను చికాకు పెడుతోంది. కొందరు ఉద్యమకారులు ఆయనను టార్గెట్ చేసుకుని విమర్శలు కురిపించడమే కాకుండా ఇంటివద్ద ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అంతేకాక రాజీనామా చేయాలన్న డిమాండ్ కూడా సిద్దంగా ఉంది. ఈ నేపధ్యంలో ఒక మూడు వారాల నుంచి నాలుగు వారాల పాటు అమెరికా వెళ్లి రావడానికి సిద్దమవుతున్నారు.కొంతకాలంల పాటు రాష్ట్రంలో నెలకొన్న ఈ వివాదాలకు దూరం గా ఉండవచ్చని ఆయన ఉపశమనం పొందుతున్నారని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!