అంబటి రాసలీలలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు రాసలీలల గురించి నేడు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవాలను కునే ఆడవారిని తన వద్దకు పిలిపించుకుంటాడట. జగన్ ని కలవాలనుకుంటే తాను చెప్పినట్టు చేయాలని లేదుంటే జగన్ దగ్గర అప్పాయింట్మెంట్ దొరకదని హెచ్చరిస్తాడట. వైయస్సార్సీ పార్టీ మహిళా నేతలు అంబటి రాంబాబు అంటేనే ఆమడ దూరం పారిపోతున్నారని ప్రసారం చేసింది. స్వర్ణయుగం తేస్తానని చెబుతూ కామ పురాణం నడుపుతున్నారని ఆరోపించింది. అంబటి రాంబాబు ఆడవాళ్ళని తన రాసలీలలకు వాడుకుంటున్నాడని ఎబిఎన ఛానల్ ప్రసారం చేసింది. దీంతో ఈ కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి ఇలాంటి పాడుపనులా.. అని ఈ కథనాన్ని చూసినవారు అనుకుంటున్నారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ ఇలాంటి కథనాలని ప్రసారం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. గతంలో కూడా సాక్షాత్తూ గవర్నర్ ఎన్.డి. తివారీ రాసలీలల గురించి ప్రసారం చేయడంతో ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. మరి.. ఇప్పుడు అంబటి పరిస్థితి ఏమిటి..? తనపై ప్రసారం చేసిన ఈ కథనానికి అంబటి రియాక్షన్ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి