తెలంగాణ ర‌హ‌దారులు దిగ్భంధం..


స‌క‌ల జ‌నుల స‌మ్మెలో భాగంగా తెలంగాణ జిల్లాల‌లో సోమ‌వారం ర‌హ‌దారుల దిగ్భంధం జ‌రిగింది. ఆర్‌టిసి బ‌స్సులు ఎక్క‌డిక‌క్క‌డ ఆగిపోయాయి. రోడ్డుబై బ‌స్సులు తిర‌గ‌నీయ‌ కుండా, స‌రిహ‌ద్దుల‌ను దిగ్భంధించాల‌ని టిఆర్ ఎస్‌, తెలంగా జెఏసి నిర్ణ‌యించాయి. జ‌హీరాబాద్ జహీరాబాద్, అలంపురం, కోదాడ, ఆదిలాబాద్, పోచంపల్లి ల వద్ద రహదారులను దిగ్భందనం చేశారు తెలంగాణ ఉద్య‌మ కారులు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ‌క్క‌డా కొన్ని చెదురు ముదురు సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. జ‌హీరాబాద్ ప‌స్తాపూర్‌ వ‌ద్ద ఓ ప్రైవేటు బ‌స్సు అద్దాల‌ని ధ్వంసం చేసిన తెలంగాణ వాదుల‌పై పోలీసులు లాఠీచార్జీ చేసారు. తెలంగాణ జిల్లాల‌లో ఉన్న అన్ని జాతీయ‌ ర‌హ‌దారుల‌ని దిగ్భంధం చేశారు తెలంగాణ వాదులు. అన్ని ప్ర‌ధాన రోడ్ల‌పై బైఠాయించి త‌మ నిర‌స‌న‌ల‌ని తెలుపుతున్నారు. ర‌హ‌దారుల దిగ్భంధం కోసం ప్రతి ప్రాంతానికి ఇద్దరు ఎమ్మెల్యేల చొప్పున కెసిఆర్ నియమించారు. ఒకపక్క తెలంగాణ కాంగ్రెస్ నేతలే ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడంతో ప్రభుత్వానికి పాలుపోని పరిస్థితి ఏర్పడింది. గట్టిగా చర్యలు తీసుకోవాలని ఉన్నా తీసుకోలేక , అటు ఆందోళనకు మద్దతు ఇవ్వలేక ప్రభుత్వవర్గాలు  సతమతమవుతున్నాయి. దీంతో తెలంగాణ ఆందోళనకారులకు, టిఆర్ ఎస్ నేతలకు ఎదురు లేని పరిస్థితి ఏర్పడుతోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!