బంద్ లతో తెలంగాణ వస్తుందా?


ఈ ప్రశ్న సీమాంధ్రవాళ్లు అడిగితే తెలంగాణ ఉద్యమకారులకు కోపం రావచ్చు. కానీ అలా అడుగుతున్నది తెలంగాణ బిడ్డలే. వరుస బంద్ లు, రాస్తారొకొలు, ర్యాలీలతో జనజీవనం చిటికీమాటికీ స్తంభించిపోతుండటంతో తెలంగాణ ప్రాంత వాసులే చిరాకుపడు తున్నారు. తెలంగాణ రాజకీయ ఐకాస ఇప్పుడు కొత్త కార్యాచరణ కార్యక్రమం ప్రకటించింది. ఈనెల 28న తెలంగాణ వ్యాప్తంగా రాస్తారొకోలు చేయాలి. 30న తెలంగాణ అంతటా బంద్ పాటించాలి. అక్టోబర్ ఒకటిన కాగడాల ప్రదర్శన, అక్టోబర్ 9,10,11 తేదీల్లో మరోసారి రైల్ రోకొ ఉంటాయని ఐకాస కన్వీనర్ కోదండరాం ప్రకటించారు. దసర సెలవల్లో ఇలాంటి ఉద్యమాలు చేయడంతో నిజంగానే తెలంగాణ వస్తుందా…మొన్నటి రంజాన్ మాసంలో బంద్ లు , ఉద్యమాలకు దూరంగా ఉన్న ఐకాస ఇప్పుడు హిందువుల పండుగల వేళలో ఇబ్బందులు పెట్టడం సబబేనా, ఓసారి ఆలోచించండి. కోదండరాం వంటి మేధావులకు మైనార్టీల పండుగలంటే ఎంత భక్తో అర్థమవుతోంది. హిందువుల పండుగలప్పుడు ఇటు తెలంగాణ వారినీ, అటు ఆంధ్రవాళ్లను ఏడిపించడంలో ఆంతర్యం ఏమిటి? శరన్నవరాత్రి ఉత్సవాలు ఒక్క ఆంధ్ర ప్రాంతంలోనేకాదు, తెలంగాణలో కూడా బాగా జరుపుకుంటారు. అలాంటప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఈ ఉద్యమాలు అవసరమా…అలా చేస్తే కేంద్రం గుర్తించి ప్రత్యేక రాష్ట్రం ఈ పదిరోజుల్లోనే ఇచ్చేస్తుందా..ఆలోచించాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!