ద‌స‌రా కానుక‌గా తెలంగాణ ప్ర‌క‌ట‌న‌..?


ప్ర‌స్తుతం తెలంగాణ జిల్లాల‌లో 15 రోజుల పాటు కొన‌సాగుతున్న స‌క‌ల జ‌నుల స‌మ్మె సెగ కేంద్ర వ‌ర‌కూ పాకింది. 15 రోజులుగా జ‌రుగుతున్న స‌మ్మె వ‌ల్ల ప్ర‌భుత్వ ఖ‌జానాకి భారీగా గండిప‌డింది. బ‌స్సులు, రైళ్ళు, బొగ్గుగ‌నుల ప‌నులు ఇలా అన్నీ ఆగిపోవ‌డంతో ప్ర‌భుత్వం దిగివ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే తెలంగాణ‌పై ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవ‌డానికి అధిష్టానం సిద్దంగా ఉంద‌ని, ఈ విష‌యంపై సోనియాగాంధీ కూడా సుముఖంగానే ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంనుండి ముఖ్య నేత‌ల‌ని ఢిలీకి పిలిపించ‌డం చూస్తుంటే ఈ ద‌స‌రా పండ‌గ‌లోపు తెలంగాణ‌పై ఓ స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తీసుకోనుంద‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈపాటికే రాష్ట్రం నుండి సిఎం. కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, కాంగ్రెస్ ముఖ్య నేత చిరంజీవిలు ఢిల్లీకి వెళ్ళారు. తెలంగాణ మంత్రులు జానారెడ్డి, కేశ‌వ‌రావు త‌దిత‌రులు ఆజాద్‌తో మంత‌నాలు జ‌రుపుతున్నారు. అయితే ఆజాద్ తెలంగాణ అంశం త‌న చేతిలో లేద‌ని స్ప‌ష్టం చేయ‌డం, ఆ వెంట‌నే నేత‌లంద‌రినీ ఢిల్లీకి పిలిపించి ప్ర‌ధాని, సోనియాగాంధీ స‌మ‌క్షంలోనే ఈ స‌మ‌స్య‌కి ఓ ప‌రిష్కారాన్ని క‌నుగొనాల‌నుకోవ‌డం చూస్తుంటే ఈ ద‌స‌రా కానుక‌గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అధిష్టానం గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తుందా అన్న ఊహాగానాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం అధిష్టానానికి తెలంగాణ విష‌య‌మై ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఇంకా తాత్సారం చేస్తే స‌క‌ల జ‌నుల స‌మ్మె మ‌రింత తీవ్ర‌త‌రం అవుతుంద‌ని ఓ వైపు కోదండ‌రాం హెచ్చరిక చేయ‌డమే కాకుండా మ‌రో ప‌దిహేను రోజుల వ‌ర‌కు స‌మ్మె కార్యాచ‌ర‌ణ‌ని కూడా ప్ర‌క‌టించ‌డంతో ఢిల్లీ పెద్ద‌ల‌లో చైత‌న్యం వ‌చ్చింది.. అందుకే ఆఘ‌మేఘాల మీద ముఖ్య‌నాయ‌కుల‌ని ఢిల్లీకి పిలిపించుకుని మంత‌నాలు సాగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.. మ‌రి.. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఈ ద‌స‌రా ప్ర‌త్యేకం కానుందాం.. ద‌స‌రా కానుక‌గా తెలంగాణ రాష్ట్రం ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుందా.. అన్న‌ది వేచిచూడాల్సిందే..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!