అడ్డంగా బుక్క‌యిన శంక‌ర్రావ్‌


శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందని సామెత. రాష్ట్ర మంత్రి డాక్టర్ పి.శంకరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ పై కేవలం ఒక లేఖ రాస్తే హైకోర్టు ఛీఫ్ జస్టిస్ కక్రు తీవ్రంగా స్పందించి ఏకంగా సిబిఐ విచారణకు ఆదేశించారు.ఆయన జగన్ పై నే కాదు. ఎమ్.ఆర్.ప్రాపర్టీస్ అవకతవకల పై ఆయన రాసిన లేఖను కూడా హైకోర్టు స్వీకరించి విచారణకు ఆదేశించింది. దాంతో శంకరరావు లో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. ఇక తోటి మంత్రులపై ఇష్టానుసారంగా ఆరోపణలు గుప్పించారు. వాటికి ఆధారాలు ఉన్నాయో లేవో కాని హోం మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెకటరమణ లపై అభియోగాలు మోపడమే కాకుండా వారిపై చర్య తీసుకోకపోతే అక్టోబర్ మూడున రాజీనామా చేస్తానని హెచ్చరించారు. మరో ఐదుగురు మంత్రులపై కూడా ఆరోపణలు సిద్దం చేసుకుంటున్నానన్నారు. దీనిని కూడా హైకోర్టు సుమోటోగా స్వీకరించి అందరిని ఆశ్చర్యపరచింది. రాజకీయ నాయకులు చేసుకునే ఆరోపణలపై కూడా హైకోర్టు స్పందిస్తుందా అన్న ప్రశ్న తలెత్తింది. ఈ నేపధ్యంలో శంకరరావు కొంతకాలం క్రితం ఒక కార్పొరేటర్ టిక్కట్ ఇప్పించడానికి గాను లంచం తీసుకుంటున్నట్లు ఆధార సహితంగా మీడియాలో ప్రసారం అయింది. అక్కడితే ఆగకుండా భూ ఆక్రమణ ఆరోపణలను కూడా కొందరు చేస్తున్నారు. అందరిపై ఆరోపణలు చేస్తూ హల్ చల్ చేసిన శంకరరావు పై ఇప్పుడు అనేక మంది అభియోగాలు మోపుతున్నారు. మరి దీనిపై శంకరరావు ఎలా స్పందిస్తారు? అలాగే హైకోర్టు కూడా ఈయనపై వచ్చిన కధనాలను స్వీకరించి సిబిఐ విచారణకు అదేశిస్తుందా?వ్యవస్థలు వ్యవస్థలుగా పనిచేయడం లేదు. ఒక పరిధిలోకి మరొకరు వస్తూ ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల వ్యవస్థలకు చేటు కలుగుతుంది. ఇప్పుడు శంకరరావుపై హైకోర్టు సుముటోగా కేసు స్వీకరించవలసిన పరిస్థితి ఏర్పడింది. అలా తీసుకుంటే అవినీతి పరుడు ఇతరులపై చేసే ఆరోపణలకు ఎంత విలువ ఉంటుందన్న ప్రశ్న వస్తుంది. తీసుకోకపోతే హైకోర్టు కూడా కొందరి విషయంలోనే స్పందించి , మరికొందరి విషయంలో చూసి చూడనట్లు ఉంటుందా అన్న అభిప్రాయానికి ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. ఈ ఆరోపణలపై శంకరరావు ఏమిచెబుతారో? హైకోర్టు ఏమి చేస్తుందో చూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!