అంబ‌టికి ముందే తెలుసా..?


ఈ రోజు ఎబిఎన్ ఆంధ్ర‌జ్యోతి ఛానెల్‌లో ప్ర‌సార‌మైన అంబ‌టి రాస‌లీల‌ల గురించి అంబ‌టికి ముందే తెలుస‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. క్రితం రోజునే అంబ‌టికి ఎబిఎస్ ఛాన‌ల్ వారే ఎవ‌రో ఉప్పందించార‌ని తెలుస్తోంది. అందుకే అంబ‌టి నిన్న ఓ మీడియా స‌మావేశంలో వ్యూహాత్మ‌కంగా మాట్లాడారు. టిడిపి, కాంగ్రెస్ నాయ‌కులు త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డానికి ఎంత‌కైనా దిగ‌జారుతార‌ని,  త‌మ ద‌గ్గ‌ర ఎంతో న‌ల్ల‌ద‌నం ఉంద‌నీ అంటార‌ని, తాము అమ్మాయ‌ల‌ని విదేశాల‌కి దిగుమ‌తి చేస్త‌మ‌ని కూడా ఆరోపిస్తార‌ని, వారికి సంబంధించిన ఓ వ‌ర్గం మీడ‌యా కూడా దీనికి అధిక ప్రాధాన్య‌త క‌ల్పిస్తుంద‌న్న వ్యాఖ్య‌లు చేశారు. దీన్ని బ‌ట్ట అంబ‌టి రాంబాబుకి త‌న రాస‌లీల‌ల టెలికాస్ట్‌కి సంబంధించి ఆ మీడియా స‌మావేశానికి ముందే తెలుస‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ విష‌యం తెలిసినందువ‌ల్ల రాత్రికి రాత్రే త‌న శ‌క్తియుక్తుల‌న్నింటినీ ప్ర‌ద‌ర్శించి హైద‌రాబాద్ తో పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల‌లో ఎబిఎన్ ఛాన‌ల్ ప్ర‌సారం కాకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాడ‌ని తెలుస్తోంది. ఇక అంబ‌టి స‌ర‌సాల గురించిన వార్తా ప్ర‌సారం కావ‌టంతో ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులు అంబటి రాంబాబుని తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!