సిఎం, బొత్సల మ‌ధ్య అంతరం..


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి,పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య మరో కుంపటి రగిలింది.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్పుడు నివేదికలు పంపుతూ తెలంగాణాను అడ్డుకుంటున్నారని తెలంగాణ నేతలు ఆరోపిస్తుంటే అలాంటివేమీ పంపలేదని ఆయన వివరణ ఇవ్వవలసి వచ్చింది. అయితే ఈసారి మరో నివేదిక కిరణ్ , బొత్స ల మద్య అంతరం పెంచుతోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.కోస్తాలో బొత్స సత్యనారాయణ, మెగాస్టార్ చిరంజీవిలను మరీ ఎక్కువగా ప్రొజెక్టు చేస్తే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని కిరణ్ పార్టీ హైకమాండ్ కు ఒక నివేదిక పంపారన్న సమాచారం గుప్పుమంది. వీరిద్దరు కలిస్తే ఒక బలం అనుకుంటుంటే కిరణ్ ఇలాంటి నివేదిక ఎలా పంపుతారని అడిగేవారికి కూడా అందులో ఒక సమాధానం ఉంది.కోస్తాలో బొత్స, చిరంజీవిల సామాజికవర్గానికి , ఎస్.సి వర్గాలకు మద్య వైరుధ్యాలు ఉన్నాయని, వీరికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే ఎస్.సి.లు పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉందని కిరణ్ నివేదికలో ప్రస్తావించారని అంటున్నారు.అలాగే కొన్ని చోట్ల ఈ సామాజికవర్గానికి బిసిలకు అంతగా పొసగదని కూడా పేర్కొన్నారని అంటున్నారు.ఇది కావాలని బొత్స ఇమేజీని దెబ్బతీయడమేనని బొత్స సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి విశాఖపట్నం గర్జన సభకు ముందుగా కిరణ్ రానన్నారని, కాని ఆ తర్వాత ఆ సభలో బొత్స ఒక్కరే హీరో అవుతారని భావించి , తదుపరి తాను కూడా హాజరవుతానని చెప్పారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తం మీద కిరణ్ తన నివేదికల ద్వారా పార్టీలోని ఆయా వర్గాలను, ముఖ్య నేతలను దూరం చేసుకుంటున్నారని కొన్ని వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!