ఛానెల్‌ ప్ర‌సారాల‌ని ఆపించేశారు


అంబ‌టి రాంబాబు రాస‌లీల‌ల‌పై ఎబిఎన్ ఆంధ్ర‌జ్యోతి ఛానెల్ ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ప్ర‌సారం చేయ‌డంతో ఆ ప్ర‌సారాన్ని ప్ర‌జ‌లు చూడ‌కుండా ఉండేందుకు అంబ‌టి తీవ్రంగా కృషిచేశార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. త‌న‌పై వ‌స్తున్న ఈ ప్ర‌సారాల‌ని ఎవ‌రూ చూడ‌కుండా ఉండేందుకు అంబ‌టి కొంద‌రు కేబుల్ ఆప‌రేట‌ర్ల‌కి న‌యానో, భ‌యానో మాట్లాడి చాలా చోట్ల కేబుల్ ప్ర‌సారాల‌ని నిలిపివేయ‌డంలో అంబ‌టి కొంత‌వ‌ర‌కు స‌క్సెస్ సాధించార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా హైద‌రాబ‌ద్‌లో, మీడియా ఛానెల్స్ ఉన్న ప్రాంతం బంజారాహిల్స్‌, మ‌నికొండ‌, అటు ఎల్‌.బి. న‌గ‌ర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ ప్రాంతాల‌లో కేబుల్ ప్ర‌సారాల‌ని నిలిపివేసేందుకు తీవ్రంగా కృషిచేశారు. ఆంధ్ర‌జ్యోతి అంబ‌టి రాస‌లీల‌ల‌పై ఉద‌యం 7 గంట‌ల‌కు వార్త‌ని ప్ర‌సారం చేసింది.. ఆ త‌ర్వాత తిరిగి 10 గంట‌ల‌కు అంబ‌టి రాస‌లీల‌ల‌పై వార్తని ప్ర‌సారం చేస్తాన‌న చెప్పింది. దాంతో ఆ స‌మ‌యంలో ఎబిఎన్ ఛానెల్ ప్ర‌సారాన్ని నిలిపివేయ‌డానికి తీవ్రంగా కృషి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జ‌ల్లాల‌లో ముఖ్యంగా గుంటూరు, ఖ‌మ్మం, కృష్ణా జిల్లాల‌లో ఈ ప్ర‌సారం రాకుండా నిలిపివేసారు. ఇక పోతే త‌న‌పై వ‌చ్చిన ఈ ప్ర‌సారానిన ఇంత‌వ‌ర‌కూ అంబ‌టి ఖండించ‌క‌పోవ‌డం విశేషం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!