సచిన్ సొంతింటి కల నెరవేరింది..
ఏన్నో ఏళ్లుగా కలలు కన్న ఇంట్లోకి సచిన్ టెండూల్కర్ బుధవారం గృహప్రవేశం చేశాడు. ఇంతకుముందు స్పోర్ట్స్ కోటా కింద వచ్చిన ఫ్లాట్‌లో నివసించి న టెండూల్కర్.. బాంద్రా శివారుల్లోని పెర్రీ క్రాస్ రోడ్ వద్ద ఆరు వేల గజాల స్థలంలో తనకు నచ్చిన విధంగా ఇల్లు నిర్మించుకున్నాడు. ‘సొంత ఇంటి విషయంలో ప్రతి ఒక్కరు ఎన్నో కలలు కంటారు. నేను కూడా అంతే. నా కలను నిజం చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. అయితే మొన్నటి దాకా నివసించిన స్పోర్ట్స్ కోటా ఇంటిని వెంటనే ఖాళీ చేశాను. ఎందుకంటే ఆ ఇల్లు మరో క్రీడాకారుడికి ఉపయోగపడతుం ది’అని సచిన్ అన్నాడు.
ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లకముందే జూన్ 11న గృహ శాంతి, వాస్తు పూజలు చేసినట్టు తెలిపాడు. ఇంగ్లండ్ పర్యటన తర్వాత తొలిసారిగా తన తల్లిని తీసుకొని కొత్త ఇంటికి వచ్చాడు. పిల్లలకు ఇంకా ఇల్లు చూపించలేదని సచిన్ చెప్పా డు. తన కలల కోటను కోసం సచిన్ మొత్తం 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. బం గ్లా చుట్టూ ఫెన్సింగ్‌తో కూడిన ఎత్తయిన గోడ నిర్మించాడు. సీసీ కెమెరాలు, సెన్సర్లను కూడా అమర్చాడు. భూ మట్టానికి పైన మూడు అంతస్తులు, కింద రెండు సెల్లార్‌లు ఉన్నాయి. ఒక సెల్లార్‌లో పనివాళ్లు, నిఘా వర్గానికి చెందిన వారు ఉంటారు.
ఇష్టమైన కార్ల పార్కింగ్ కోసం మరో సెల్లార్‌ను నిర్మించుకున్నాడు. సచిన్, అంజలీ బెడ్ రూమ్ మూడో అంతస్తులో ఉండగా.. కుమారుడు అర్జున్, కూతురు సారా గదులతో పాటు.. గెస్ట్ రూమ్ కూడా మొదటి అంతస్తులో ఉన్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో దేవుడిగది, డ్రాయిం గ్, డైనింగ్ రూములు, ఆ పక్కనే.. కెరీర్‌లో తాను అందుకున్న అవార్డులు, ట్రోఫీలతో కూడిన గ్యాలరీ ఉంటుంది. భవనం పైభాగంలో (టెర్రస్‌పై) స్విమ్మింగ్‌పూల్‌ను కట్టించుకున్నాడు. సచిన్ ఇంటి పక్కనే ఉన్న స్కూలు చిన్నారులు.. మాస్టర్ బ్లాస్టర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు ఇంటికి రాగా.. సచిన్ వారికి స్వీట్స్ పంచిపెట్టాడు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి