నేడు తెలంగాణ విమోచన దినోత్సవం
నేడు తెలంగాణ విమోచన దినోత్సవం.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు కె. కేశవ రావు, మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు. మంత్రులు జానారెడ్డి, సుదర్శన్ రెడ్డి, దానం నాగేందర్ కూడా పాల్గొన్నారు. అయితే మంత్రి దానం నాగేందర్ మాట్లాడుతూ గాంధీభవన్‌లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ఉంటే బాగుండేదని రాష్ట్ర అభిప్రాయపడ్డారు. తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు సంయమనం పాటించడం అవసరమని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నాయకుడు స్వామిగౌడ్‌ను అరెస్టు చేయడం తొందరపాటు చర్యేనని ఆయన అన్నారు. సమ్మె చేస్తున్న తెలంగాణ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తామని తాము చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో సకల జనుల సమ్మె శాంతియుతంగా జరుగుతోందని ఆయన అన్నారు. సకల జనుల సమ్మెను పరిష్కరించడానికి త్వరలో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అవుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా శనివారం గాంధీభవన్‌లో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జాతీయ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు. తెలంగాణ విమోచన కోసం చేసిన త్యాగాలను ఆయన కొనియాడారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి