హ్యాపీ బర్త్ డే టు పిఎం


ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ డెబ్బై తొమ్మిదో పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.ప్రదానిగా ఒక నెహ్రూయేతర కుటుంబాలకుచెందినవారిలో ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేసిన వ్యక్తిగా ఇప్పటికే రికార్డును సొంతం చేసుకున్న మన్మోహన్ సింగ్ తన పుట్టిన రోజును గత ఎనిమిదేళ్లలో నాలుగుసార్లు విదేశాలలలోనే చేసుకోవడం విశేషం. సరిగ్గా పుట్టిన రోజు నాటికి ఆయన విదేశీ పర్యటనలో ఉంటున్నారన్నమాట. ఈ ఏడాది కూడా విదేశీ పర్యటనలో ఉండి మన్మోహన్ న్యూయార్కు నుంచి ఫ్రాంక్ ఫర్ట్ మీదుగా ఢిల్లీకి వస్తున్నారు. ఇది ఒరిజినల్ పుట్టిన రోజా కాదా అన్నది తెలియదు కాని, రికార్డుల ప్రకారం ఈ తేదీనే ఉంది. కాగా గతంలో కన్నా ఈసారి మన్మోహన్ కాస్త సంక్షోభంలో ఉన్నారనే చెప్పాలి. 2 జి స్పెక్ట్రమ్ కేసు వ్యవహారంలో ఆయన కూడా పొరపాటు చేశారని,మారన్ ఒత్తడికి లొంగారన్న విషయం వెలుగులోకి వచ్చింది. కాగా అదే సమయంలో సీనియర్ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరంల మధ్య రేగిన చిచ్చు కూడా ఆయనను ఇరకాటంలో నెడుతోంది.ఏది ఏమైనాప్పట్టికి ఇంత సంక్షోభంలో కూడా వ్యక్తిగతంగా ప్రధానిని ఎవరూ అవినీతి పరుడు అని విమర్శించలేని పరిస్థితి ఉండడం ఆయన నిజాయితీకి నిండైన నిదర్శనం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!