శంక‌ర‌రావుపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు నిజ‌మేనా..?


తనపై కక్ష తో ఒక నిరాధార వార్తను ప్రసారం చేశా రని,వీడియో మానిప్యులేషన్ ద్వారా ఆ కధనాన్ని ప్రసారం చేశారని, రాజకీయ కుట్ర ఉందని,ఆ ఛానల్ ఎవరిది?దాని వెనుక ఎవరుఉన్నారో అందరికి తెలుసు.. అయినా నా అవినీతి వ్యతిరేక పోరాటం ఆగదు అని మంత్రి శంకరరావు అన్నారు. కార్పొరేటర్ టిక్కెట్ ఇవ్వడానికి గాను లక్షల రూపాయలు తీసుకున్నారన్న ఆరోపణపై ఆయన సంక్షిప్తంగా వివరణ ఇచ్చారు.మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెంటనే ధాంక్యు అంటూ వెళ్లిపోయారు.ఆ వార్త కధనంపై విచారణ చేసుకోవచ్చనికాని, దానిపై ఫిర్యాదు చేస్తానని కాని ఆయన అనలేదు. మామూలుగా అయితే అరగంటకు పైగా మీడియాతో మాట్లాడకుండా ఉండని శంకరరావు ఈ వార్త విషయంలోమాత్రం ముక్తసరిగా మాట్లాడి సరిపెట్టుకున్నారు.పైగా సంబందం లేని విషయాలు సుదీర్ఘంగా మాట్టాడడానికి ప్రయత్నించారు. తన ట్రాక్ రికార్డు అందరికి తెలుసని, తాను ఏ ఏ దేశాలు తిరిగింది తదితర వివరాలు చెప్పారు.మొత్తం శంకరరావు ఆత్మరక్షణలో పడినట్లే ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!