కొత్త పార్టీ యోచనలో టి-కాంగ్రెస్ నాయకులు..?
తెలంగాణపై అధిష్టానంతో అమీతూమీ కోసం చివరి ఢిల్లీ పర్యటన అంటున్న టీ కాంగ్రెస్ నేతల భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి?..సానుకూల ప్రకటన రాకపోతే పార్టీని వీడి కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా? అవును ఇందుకు రంగం సిద్ధమవుతోందని చెబుతున్నారు కొందరు కీలక నేతలు… తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ అధిష్టానానికి టీ కాంగ్రెస్ నేతల మొర… డెడ్లైన్లు, హెచ్చరికలు జారీ చేసినా స్పందించకపోవడంతో హమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు.
ఓ వైపు ఉద్యమం, మరో వైపు సకల జనుల సమ్మె ఉధృతం …తెలంగాణ ప్రజల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనే ఆలోచనలో టీ కాంగ్రెస్ నేతలు పడ్డారు. ఇప్పుడుతున్న పరిస్థితులలో అధిష్టానంతో రాజీపడితే రాజకీయంగా పుట్టగతులుండవనే ఆలోచనలో నేతలున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఏర్పాటుపై చేసిన ప్రకటనలు ఉత్తుత్తివేనని ప్రచారం జరుగుతుండటంతో ఈ దఫా నిజంగానే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు.
ఢిల్లీ పర్యటన అనంతరం కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసి ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. టీ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఛైర్మేన్ కేశవరావు ఓ అడుగు ముందుకేసి రాష్ట్ర సాధనకు తన వద్ద బ్రహ్మాండమైన అస్త్రం వుందని చెబుతున్నారు. తెలంగాణలో పరపతి తగ్గిపోతోందన్న భయం కాంగ్రెస్ నేతల్లో కలుగడంతో తుండటంతో కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
మరో వైపు కాంగ్రెస్ లో వుంటూనే తెలంగాణ కోసం పోరాడతామని… ఒక వేళ అధిష్టానం రాష్ట్రం ఇవ్వలేమని చెప్పిన మరుక్షణం కొత్త పార్టీని పెట్టేందుకు సిద్దమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు రోజుల క్రితం విలేకరులతో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. తన వ్యాఖ్యలు ఆన్‌రికార్డ్‌గా కూడా రాసుకోవచ్చని …. మాటల ఫ్లోలో తమ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని కూడా అనేశారు.
కోమటిరెడ్డికి మద్దతుగా మంత్రులు జానారెడ్డి, సారయ్యతో పాటు పలువురు ఎమ్మెల్యేలు తోడవుతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల తెలంగాణలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, టీ కాంగ్రెస్ నేతల ప్రకటనలు చూస్తే నిజంగానే సొంత కుంపటి ఏర్పాటవుతుందనే అనుమానం వ్యక్తమవుతోంది.

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి