సోనియా, ర‌త‌న్‌టాటా అత్యంత ప్ర‌భావ‌శీలురు..


యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ప్రపంచ ప్రసిద్ధ పారిశ్రామిక వేత్త రతన్ టాటా.. ఈ ఏటి మేటి ప్రభావశీలురైన వ్యక్తుల జాబితా టాప్ 50లో నిలిచారు. బ్రిటన్‌కు చెందిన ‘న్యూ స్టేట్స్‌మన్’ పత్రిక నిర్వహించిన ఈ సర్వేలో జర్మన్ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో నిలిచారు. కాగా.. సోనియాను ఈ పత్రిక ‘మేడమ్ ఇండియా’గా అభివర్ణించింది. ‘ఇటలీలో పుట్టిన సోనియా భారతదేశంలోనే అత్యంత శక్తిమంత మైన రాజకీయ నాయకుల్లో ఒకరు.
2010 సెప్టెంబర్ 10లో నాలుగోసారి ఏఐసీసీ అధ్యక్షురాలిగా ఎంపికవడం ద్వారా భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ కాలంపాటు ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి’ అని పేర్కొంది. సోనియా ఇందిరాగాంధీ కోడలు అనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అలాగే, రతన్ టాటాను ‘మెటల్ హెడ్’ అభివర్ణించిన పత్రిక… భారత దేశాన్ని అంతర్జాతీయ అధికార కేంద్రంగా మార్చుతున్న చి హ్నంగా పేర్కొంది. తన వారసుడు భారతీయుడే అయి ఉండక్కర్లేదన్న రతన్ టాటా వ్యాఖ్యల నుబట్టి ఆయనది నిజంగా అంతర్జాతీయ వ్యాపార సామ్రాజ్యం అనడానికి తిరుగులేని నిదర్శనమంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!