మరో ‘డర్టీపిక్షర్’
అలనాటి ఐటం సెక్సీ గర్ల్ సిల్క్ స్మిత జీవితంపై రూపొందుతున్న ‘డర్టీ పిక్చర్’పై బాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఈ చిత్రంలోని స్టిల్స్‌లో విద్యాబాలన్ చేసిన హాట్ ఎక్స్‌పోజింగ్‌తో ఈ చిత్రంపై మరిన్ని ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఆరోజుల్లో సిల్క్‌స్మితతో పలువురు టాప్ హీరోలు అక్రమ సంబంధం పెట్టుకున్నారన్న విషయాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారన్న గాసిప్స్‌తో విడుదలకి ముందే ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే తాజాగా మరో డర్టీపిక్షర్ తీయడానికి మరో దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు మాధుర్ బండార్కర్. మధుర్ త్వరలో ఓ సినిమా రూపొందించ బోతున్నారని సమాచారం. భారత్ నుంచి ఇంటర్నేషనల్ ఫోర్న్ నటిగా ఎదిగిన ‘సన్నీ లియోన్ ఎకా కరెన్ మల్హోత్రా’ జీవితంపై బండార్కర్ సినిమా తీయబోతున్నాడని బాలీవుడ్ టాక్. సన్నీ లియోన్ కు ఇంటర్నేషనల్ అడల్ట్ సినిమాల మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.ఒక ఇండియన్ గర్ల్ ఇంటర్నేషనల్ ఫోర్న్ నటిగా ఎలా ఎదిగింది? అనే అంశాన్ని బేస్ చేసుకుని మధుర్ సొంతంగా ఓ కల్పిత కథను రాసుకున్నాడని, దాని ఆధారంగా సినిమా రూపొందించ బోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇంకా మాధుర్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోయినప్పటికీ అన్నీ కుదిరి ఈ చిత్రం సెట్స్‌పైకి వస్తేమాత్రం ఎంతటి సంచలనానికి కేంద్రబిందువవుతుందో.. మరి.. పార్న్‌స్టార్ కథతో రూపొందబోయే ఈ చిత్రంలో పార్న్‌స్టార్‌గా నటించడానికి ఏ హీరోయిన్ ముందుకు వస్తుందో.. అన్న టాపిక్ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి