రాష్ట్ర రాజ‌కీయాల్లో భారీ మార్పు రాబోతుందా..?


మరో వారం రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు ఏర్పడే అవకాశాలున్నాయని.. రాజీనామా చేసిన అనకాపల్లి ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ.. రెండు మూడు నెలల్లో ఉప ఎన్నికలు రావొచ్చని చెప్పుకొచ్చారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలుస్తారని.. రాజీనామాలను ఆమోదింపజేసుకుంటారని తెలిపారు. ఒకవేళ రాజీనామాలు ఆమోదం అయితే.. రాజకీయ పరిస్థితి వేడెక్కడం ఖాయం అన్నారు. లేకుంటే రాజీనామాలు ఆమోదింపజేసుకునే వరకు పోరాడుతామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు. ప్రజలంతా ఆయనకు మద్దతు తెలుపుతున్నారని చెప్పుకొచ్చారు. జగన్ పై జరుగుతున్న సీబీఐ విచారణపై జాతీయస్థాయి నేతల మద్దతు కోరతామని.. తెలిపారు. ఇక విజయమ్మను ముఖ్యమంత్రి చేసి.. జగన్ జాతీయస్థాయిలో కీలకంగా మారే అవకాశం ఉందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తమ టార్గెట్ అది కాదన్నారు. జగన్ పై జరుగుతున్న కాంగ్రెస్ కుట్రలను జాతీయస్థాయిలో ఎండగడుతామని తెలిపారు. మరోవైపు రాజీనామా ఆమోదం అయ్యాక.. వచ్చే ఉప ఎన్నికల్లో కూడా ఎంపీ పదవికే పోటీ చేస్తానని సబ్బం హరి చెప్పుకొచ్చారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!