11-11-11 విశిష్టత ఏమిటి..?


11.11.11… ఇప్పుడు ఎక్కడ విన్నా పదకొండు అంకెల మాటలే. ఓసారి క్యాలెండర్ వైపు చూడండి…2011 నవంబర్ 11. దీన్నే పూర్తిగా అంకెల రూపంలో పెడితే 11.11.11 వచ్చేస్తుంది.  సంఖ్యాశాస్త్ర పరంగా 11. అంకెకు విశిష్టప్రాధాన్యత ఉందనే అంటున్నారు. ఈరోజంతటికీ విశిష్టత ఉందని నమ్మేవారు కొందరైతే, మరో మూడుసార్లు పదకొండు అంకెలను కలుపుకుని మురిసిపోయేవారు మరికొందరు. 11 గంటల, 11 నిమిషాల 11 సెకన్లు కలిపితే ఆరుసార్లు 11 అంకెలు… 11/11/11/11/11/11. రోజులో రెండు సార్లు రాబోతున్న 11/11/11/11/11/11. ఉదయం ఒకసారి, మళ్ళీ రాత్రికి మరోసారి.

ఈ క్షణం శుభముహూర్తమా?

నమ్మేవారికి నమ్మినంత.. 2001లో ఒకటి అంకెల ప్రభావం.. జనవరి 1 మధ్యాహ్నం 1గంటా 1 నిమిషం 1 సెకను.. ఇదే ఆరంకెల గారడీ: 1/1/1/1/1/1.. అలాగే 2002లో రెండంకెల గారడీ ఆరుసార్లు రెండు అంకె…2/2/2/2/2/2… ఈ మాదిరిగానే ఇప్పుడొచ్చేసింది…11/11/11/11/11/11. 11 అంకె ప్రభావమున్న రోజు కావడంతో సంఖ్యాశాస్త్రవేత్తలకు చేతినిండా పని. కూడికలు, తీసివేతలతో భవిష్యదర్శనం చేయిస్తున్నారు. 11/11/11లో ఆరుసార్లు ఒకటి రావడంతో ఆరు అంకెను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారు ప్రేమమూర్తులుగా ఎదుగుతారని చెబుతున్నారు.

6 అంకె శుక్రగ్రహానికి సంకేతం

6, 15, 24 తేదీల‌లో వీటిని సంఖ్యాశాస్త్రప‌రంగా కూడితే 6 అంకె వ‌స్తుంది.. అందుకే ఈ ఆరు అంకెకు అంత ప్రాధ‌న్యం.. 6 అంకె శుక్ర గ్రహానికి సంకేతం.. శుక్రుడు అందం, ఆకర్షణ, ప్రేమకు కారకుడన్న నమ్మకం ఉంది. అందుకే, ఆరు అంకెతో ముడిపడిన తేదీల్లో గానీ, ఘడియల్లోగానీ పుట్టే పిల్లలపై శుక్రడి ప్రభావం ఉంటుందని సంఖ్యాశాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఈ 11.11.11 వ తేదీ  ప్రపంచ దేశాలనే ఒక ఊపు ఊపేస్తోంది. ఈ తేదీలో దుశ్పభావాల సంగ‌తి ఎలాగున్నా.. చాలా మందికి మాత్రం ఈ తేదీ శుభ‌క‌ర‌మ‌ని విశ్వసిస్తున్నారు.. అందుకే  శుభకరమే అని చెప్పడంతో ఊరటచెందిన జనం పండుగ చేసేసుకుంటున్నారు.
-ఎన్నార్టీ
9885292208

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!