లోక్‌స‌భ‌లో తెలంగాణ లొల్లి


సమావేశాలు ప్రారంభమైన రోజే తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ విభజన, ధరల అంశాలతో మంగళవారం లోకసభ దద్దరిల్లింది. ప్రతిపక్షాలకు సర్ది చెప్పేందుకు స్పీకర్ మీరా కుమార్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ సభ సద్దుమణగలేదు. దీంతో ఆమె సభను బుధవారానికి వాయిదా వేసింది. అంతకుముందు పదకొండు గంటలకు సభ ప్రారంభం కాగానే తెలంగాణ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులు తెలంగాణకు అనుకూలంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ తర్వాత స్పీకర్ పన్నెండు గంటలకు సభను మొదటిసారి వాయిదా వేశారు. పన్నెండు గంటలకు సభ మళ్లీ ప్రారంభమైంది.
టిఆర్ఎస్, టి కాంగ్ ఎంపీలు తెలంగాణకు కోసం, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి తీర్మానం చేసినట్లు చేస్తే ఊరుకునేది లేదని సమాజ్ వాది పార్టీ ఎంపీలు గందరగోళం సృష్టించారు. ఎస్పీ ఎంపీలు ప్లకార్డులతో స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. మిగిలిన ప్రతిపక్షాలు ధరలపై ఆందోళన వెలిబుచ్చాయి. దీంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేసింది. కాగా అంతకుముందే రాజ్యసభను హమీద్ అన్సారీ రేపటికి వాయిదా వేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!