ఎవరెస్ట్ పై టాయిలెట్స్ !
ఎవరెస్ట్ శిఖరంమీద టాయిలెట్స్ ! ఈ మాట వినగానే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అయితే, ఇప్పుడు ఆ అవసరం కూడా వచ్చిందని అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. ఆ వివరాలేమిటో ఓసారి చూద్దాం.
ఎవరెస్ట్ శిఖరంమీద టాయిలెట్స్ ఏర్పాటుచేయాలన్న డిమాండ్ ఊపెక్కింది. హిమాలయ పర్వతాలమీద అందునా ఎవరెస్ట్ శిఖరంమీద టాయిలెట్స్ ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఇది నిజమే అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. పోర్టబుల్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేయాల్సిందేనంటూ వీరు నేపాల్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఒకప్పుడు హిమాలయాలు ఎక్కేవారి సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టాల్సి వచ్చేది. అందులోనూ ఎవరెస్ట్ శిఖరారోహణ చేసేవారి సంఖ్య మరీ తక్కువగానే ఉండేది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు.
ఏటికేడు పెరుగుతున్న
ఎవరెస్ట్ పర్వతారోహకలు
నేపాల్ లోని సౌత్ బేస్ లో
పర్వతారోహకుల సందడి
పెరుగుతున్న టాయిలెట్స్ ఆవశ్యకత
మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఏర్పాట్లు ఉండాలని `ఇకో హిమాల్’ అనే స్వచ్ఛంధ సంస్థ అంటోంది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కే పర్వతారోహకుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆ ప్రాంతంలో మానవ వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. దీంతో టాయిలెట్స్ ను ఏర్పాటుచేయాల్సిందేనంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు.
గడచిన 50ఏళ్లుగా
ఎవరెస్ట్ పై పెరుగుతున్న మానవ వ్యర్థాలు
డంప్ యార్డ్ గా మారిపోతున్న ఎవరెస్ట్
హిమాలయాలపై అత్యంత శీతల ఉష్ణోగ్రతలుంటాయి. ఏ జీవసంబంధమైన పదార్ధమైనా అక్కడ వెంటనే కుళ్లిపోవడమో, లేదా మంచులో కలిసిపోవడం జరగదు. ఇటువంటి పరిస్థితుల్లో మానవ వ్యర్థాల నుంచి పర్యావరణకు హాని కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాస్త్రవేత్తలు కోరుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి