అవిశ్వాసం.. ఎవ‌రికి ప‌రీక్ష‌..?


రాష్ట్ర శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెడితే పరిణామాలు ఎటా ఉంటాయన్నదానిపై ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో విధంగా ఆలోచిస్తోంది.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు అవిశ్వాస తీర్మానం పెడితే అది కాంగ్రెస్ ,టిడిపిలకు పరీక్ష అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. అవిశ్వాసాన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్ గా పెడితే అప్పుడు జగన్ క్రియాశీలకం అయి ,ప్రభుత్వాన్ని పడగొ్ట్టడానికి ప్రయత్నిస్తారని అప్పుడు కాంగ్రెస్ కు ఇరకాటం ఏర్పడుతుందని వీరు అబిప్రాయపడుతున్నారు. అదే సమయంలో అవిశ్వాసం వీగిపోతే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో మాచ్ ఫిక్సింగ్ చేసుకుందన్న విమర్శలను ఎదుర్కోవలసి ఉంటుందని వారు అంటున్నారు. రెండు రకాలుగాను అటు కాంగ్రెస్ , ఇటు టిడిపిలకు అది ఇబ్బంది కలిగించేదేనని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు అయితే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు పరీక్ష కాదా అనిఅడిగితే తమకు ప్రస్తుతం ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బహిరంగంగానే కనబడుతుందని,వారితోపాటు మరికొందరు కనుక అవిశ్వాసానికి మద్దతు ఇస్తే అప్పుడు తమకు ప్రయోజనం నెరవేరుతుందని, అలా కాని పక్షంలోతమకు కాస్త ఇబ్బంది ఉన్నా,టిడిపి పూర్తి స్థాయిలో అవిశ్వాసం పెట్టలేకపోతే వచ్చే ఇబ్బందితో పోల్చితే తమకు తక్కువేనని వారు భావిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!