డిసెంబ‌ర్‌లో మంత్రివ‌ర్గ విస్తర‌ణ‌


డిసెంబరు నెలాఖరులో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా?ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మళ్లీ మంత్రివర్గంలో మార్పులు ,చేర్పులు చేయలేదు. కిరణ్ కు చేయాలని ఉన్నా పరిస్థితులు కలసి రావడం లేదు.పార్టీ అధిష్టానం నుంచి అనుమతి రావడం లేదు. దానికి తోడు తెలంగాణ సమస్య వైపు ఎటూ తేలకపోవడంతో ఏ మార్పు చేసినా ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.అలాగే జగన్ వర్గం ఎమ్మెల్యేలదీ పెద్ద సమస్యగా మారుతూ వచ్చింది. అయితే ఇటీవల కొంతకకాలంగా పరిస్థితులు మారుతుండడంతో ముఖ్యమంత్రి కూడా మంత్రివర్గ మార్పుల గురించి ప్రస్తావిస్తున్నారు. శాసనమండలి సభ్యుడు ఒకరు చెప్పారు.గతంలో మంత్రి వర్గ విస్తరణ గురించి ఎవరైనా అడిగితే ఇప్పుడు ఎలా అనేవారని, కాని గత కొద్ది రోజులుగా ఇదే ప్రశ్న వేస్తే త్వరలో మంత్రి వర్గ విస్తరణ అని చెబుతున్నారని అంటున్నారు. మంత్రులుగా ఉన్న జూపల్లె కృష్ణారావు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామాలుచేయడంతో వారి బదులు కూడా కొత్తవారిని తీసుకోవలసి ఉంది. అలాగే ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత ఆ వర్గానికి చెందిన ఇద్దరు లేదా ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వవలసి ఉంది. అది చాలాకాలంగా పెండింగులోఉంది. తెలంగాణ ఉద్యమం కాస్త శాంతపడడం, జగన్ వర్గం ఎమ్మెల్యేలు మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తుండడంతో పరిస్థితులలో మార్పు వస్తున్నాయని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో బహుశా అంతా బాగుంటే డిసెంబరు ఆఖరులోపు మంత్రివర్గ విస్తరణ జరగవచ్చని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారట.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!