అయోమ‌యంలో టి-ఎంపీలు..?


కాంగ్రెస్ తెలంగాణ ఎమ్.పిలు కాస్త సంకట పరిస్థితిలో పడినట్లు కనబడుతోంది.అందరూ కలిసి రాజీనామా చేయాలన్నదానిపై ఏకాభిప్రాయం లేకపోవడంతో భవిష్యత్తు కార్యాచరణపై తర్జనభర్జన పడుతున్నారు.కొందరు రాజీనామాకు మొగ్గు చూపుతుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రెండో ఎస్.ఆర్.సి.కాల పరిమితి పెట్టి వేస్తే అభ్యంతర పెట్టకూడదని మరికొందరు భావిస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత కేశవరావు వంటి వారు రాజీనామాలపై కాకుండా పార్లమెంటుకు వెళ్లి స్తంభింప చేయాలని సూచిస్తున్నారని అంటున్నారు.కాగా వీరికి తోడుగా కాంగ్రెస్ తెలంగాణ మంత్రులుకాని, ఎమ్మెల్యేలు కాని రాకపోవడం వీరికి నెగిటివ్ పాయింట్ గా ఉంది.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎమ్.పిలకు ఏర్పడిన విబేధాలలో వీరు సి.ఎమ్.కు బాగా దూరం అయ్యారు. అయితే ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎమ్మెల్యేలను తనవైపునకు తిప్పుకోవడంలో కృతకృత్యమవడంతో ఎమ్.పిలకు మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో మంత్రి జానారెడ్డి తెలంగాణవాదానికి అనుకూలంగా మాట్లాడుతూనే సచివాలయానికి వెళ్లి విధులకు హాజరయ్యారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామ చేసి దీక్ష జరిపినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ పరిస్థితులన్నిటిని ఎమ్.పిలు చర్చిస్తున్నారు.ఎమ్.పి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఇంటిలో జరుగుతున్న ఎమ్.పిల బేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!