ఎన్‌.టి.ఆర్ ఫాలోవ‌ర్ నాగం


ఎన్.టి.రామారావు ఏదైనా మాట చెబితే దానికి కట్టుబడి ఉండేవాడని, ఎప్పుడూ వెనక్కి తగ్గేవారు కారని ,అలాగే తాను కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిపైనే నిలబడతానని అంటున్నారు. డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి పట్టుబట్టి తాను శాసనసభ్యత్వానికి చేసిన రాజీనామాను ఆమోదింప చేసుకున్నారు. అయితే దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన ఈ సమాధానం చెబుతున్నారు. తాను నిజమైన ఎన్.టి.ఆర్. అనుచరుడినని ఆయన చెబుతున్నారు. అంటే దానర్ధం మిగిలినవారు కారనా అంటే ఆయన ముసిముసి నవ్వుతున్నారు. విశేషం ఏమిటంటే 1995లో తెలుగుదేశంలో సంక్షోభం వచ్చినప్పుడు డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి కూడా ఎన్.టి.ఆర్.కు వ్యతిరేకంగా చంద్రబాబు పక్షాన నిలబడ్డారు. ఆ తర్వాత తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం వరకు తెలంగాణ అంశం పై పార్టీలో వివాదపడేవరకు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. తాజాగా చంద్రబాబు ఆస్తుల కేసు వచ్చినప్పుడు కూడా నాగం తన వ్యాఖ్యలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడకపోవడం విశేషం. తెలంగాణ అంశం తప్ప మిగిలిన వాటిలో తనకు పార్టీతో తగాదా లేదని అంటున్నారు.ఆయన మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబును అంతా భయపెట్టేవారేకాని ధైర్యం చెప్పేవారు లేరని, తాను గతంలో ఆయనకు ఎలా అండగా ఉందీ గుర్తు చేసుకుంటున్నారు. అందువల్లనే తాను నమ్మినదానికి కట్టుబడి ఉండే ఎన్.టి.ఆర్.నిజమైన ఫాలోయర్ ని అని చెబుతున్నారు.అదీ నాగం కధ..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!