2012లో ఎన్నికల టెన్షన్



వచ్చే ఏడాదిని ఎన్నికల సంవత్సరంగా చెప్పుకోవచ్చు. 2012 మొదటి ఐదు నెలల్లోనే ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుత శాసనసభల గడువు ముగియబోతోంది. ఉత్తరప్రదేశ్ సహా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్ ల‌లో మొదటి ఐదునెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో జరగబోతున్న ఈ మినీ ఎన్నికల సమరంపై స‌ర్వత్రా ఆస‌క్తి నెల‌కొంది
ఈ ఐదు రాష్ట్రాల ప్రస్తుత శాసనసభల గడువు వేర్వేరుగా ఉన్నప్పటికీ, అన్నింటికి కలిపి ఏకకాలంలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలను ఎన్నికల కమిషన్ పరిశీలిస్తోంది. మిగతా రాష్ట్రాల్లోకంటే, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం దశలవారీగా పోలింగ్ జరగవచ్చు.
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ జనవరిలో ప్రారంభించవచ్చు. ఇక 2012 చివర్లో గుజరాత్ ఎన్నికలు వస్తాయి. అంతేకాదు ఇదే సంవత్సరంలోనే  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా చోటుచేసుకోబోతున్నాయి. మొదటి ఐదు నెలల్లోనే 5 రాష్ట్రాలకు జ‌రిగే ఎన్నికలు దేశ రాజకీయాలపై ఎంతో ప్రభావం చూపుతాయ‌ని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే ఈ అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల స‌మ‌యం వేరు వేరుగా ఉన్నప్పటికీ ఒకేసారి నిర్వహించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇలా ఒకే సారి జ‌రిపితే అయిదు రాష్ట్రాల ఫ‌లితాలు ఒకేసారి తెలిసే అవ‌కాశం ఉంటుంది.. ఈ ఫ‌లితాల ద్వారానే దేశ రాజ‌కీయాల భ‌విష్యత్తు ఎలా ఉండ‌బోతుంద‌న్నది తెలుస్తుంది.. త్వరలోనే ఎన్నికల కమిషన్ ఈ ఎన్నిక‌ల‌పై ఓ నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉంది.

- ఎన్నార్టీ

9885292208

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!