అన్ని పార్టీల‌కు ముడుపులందాయ‌ట‌..


ఎమ్.ఆర్.కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న కోనేరు ప్రసాద్ సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం రాజకీయ పార్టీల మూలాలనే కుదిపేదిగా ఉంది.ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డితోపాటు తెలుగుదేశం, బిజెపి, టిఆర్ఎస్, వామపక్షాలకు కూడా డబ్బు పంపిణీ చేసినట్లు ప్రసాద్ చెప్పడం సంచలనంగా ఉంది.అన్ని పార్టీలు ఇలాంటి అక్రమ డబ్బుపై ఆధారపడి నడుస్తున్నాయన్న పచ్చి నిజాలు సిబిఐ దృష్టికి వచ్చినట్లు కధనాలు వస్తున్నాయి. అయితే ఇందులో సింహభాగం ఎనభై ఐదుకోట్ల మేర ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి దక్కిందని కూడా ఆయన వెల్లడించారని అంటున్నారు.అలాగే ఆయన సన్నిహితుడికి కూడా వాటా ఇచ్చినట్లు ప్రసాద్ చెప్పారని అంటున్నారు. కాగా మొత్తం నూట ముప్పై కోట్ల రూపాయలు సంపాదించగా, తనకు మిగిలింది ముప్పై కోట్ల రూపాయలేనని మిగిలినదంతా రాజకీయంగా ఖర్చుచేశానని కోనేరు ప్రసాద్ వెల్లడించారట. దీంతో రాజకీయ నేతల అసలు స్వరూపం బయటకు వస్తుందని అంటున్నారు. వస్తున్న కధనాలన్ని నిజమే అయితే అది అన్ని పార్టీలకు ఇబ్బందికరంగానే ఉంటుంది.అదేదో అధికార పార్టీకే పరిమితం అయితే అది వేరే విషయం. కాని ప్రతిపక్షాలు కూడా వాటా పొందినట్లు తేలితే రాజకీయ పార్టీలు నీతులు చెప్పే హక్కు కోల్పోతాయి. జగన్ ఆస్తుల కేసు, ఎమ్.ఆర్.కేసు , ఇప్పుడు చంద్రబాబు ఆస్తుల కేసు, అలాగే మరో పదమూడు మంది ప్రముఖుల లావాదేవీలు అన్ని బయటకు వస్తే ఇంకెన్ని సంచలనాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!