హైకోర్టులో బాబు వెకేట్ పిటిషన్


తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పిటిషన్‌పై హైకోర్టులో వెకేట్ పిటిషన్ దాఖలు చేశారు. విజయమ్మ తనపై రాజకీయ దురుద్దేశ్యంతోనే పిటిషన్ వేశారని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా తమ వాదనలు ఏమాత్రం వినకుండానే ప్రాథమిక విచారణకు ఆదేశించారని మా వాదనలు వినేంత వరకు విచారణను నిలుపుదల చేయాలని అందులో కోరారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు, టిడిపి నేత సిఎం రమేష్, నామా నాగేశ్వర రావు కూడా ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
కాగా చంద్రబాబు ఆస్తుల కేసు విషయంలో ప్రతివాదులుగా ఉన్న రామోజీరావు, సిఎం రమేష్, నామా నాగేశ్వర రావు సుప్రీం కోర్టును ఆశ్రయించడం, కేసులో ప్రస్తుత పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోమని కోర్టు వారికి సూచించడంతో పాటు హైకోర్టును ఆశ్రయించవచ్చునని చెప్పిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు సూచన మేరకు వారు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు సుప్రీంకు వెళ్లనప్పటికీ ఆ కోర్టు సూచనల దృష్ట్యా హైకోర్టును సోమవారం ఆశ్రయించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!