ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి అరెస్ట్


ఓబుళాపురం గనుల కేటాయింపు కేసులో ఐఏఎస్ అధికారిణి  శ్రీలక్ష్మిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఓఎంసీకి గనులు ముట్టజెప్పడంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై శ్రీలక్ష్మిని అరెస్టు చేశారు. ఈ కేసులో శ్రీలక్ష్మి మూడో ముద్దాయిగా ఉన్నారు. గత కొంతకాలంగా శ్రీలక్ష్మి అరెస్టు పై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే ఆమె అరెస్టు ను తప్పించుకోవడం కోసం చేయని ప్రయత్నమంటూలేదు. అంతకుముందు శ్రీలక్ష్మిని సీబీఐ అధికారులు విచారణ నిమిత్తం పిలిపించుకున్నారు. ఒకసారి9 గంటలు, మరోసారి 12 గంటలపాటు విచారణ జరిపిన తర్వాత విడిచిపెట్టారు. ఆమెకు సంబంధించిన లాకర్లలో కీలక డాక్యుమెంట్లు, బంగారాన్ని కూడా సీబీఐ అధికారులు స్వాధీనపర్చుకున్నారు. మెడికల్ గ్రౌండ్స్ లో తనను విడిచిపెట్టాలని కోరినా ఫలితం కనిపించలేదు. ఆధారాలు బలంగాఉండటంతో ఆమె అరెస్ట్ అనివార్యమైంది. శ్రీలక్ష్మి అరెస్ట్ తో మిగతా ఐఏఎస్ ల్లో గుబులు బయలుదేరింది. శ్రీలక్ష్మి అరెస్ట్ వార్తను సీబీఐ అధికారులు ధ్రువీకరించారు.

కామెంట్‌లు

  1. ఈ అవినీతి సొమ్ముతో అహంకరించే IAS లకు ఇది తొలిమెట్టు.శభాష్,మన దేశంలో కూడా ప్రజాస్వామ్యం ఉన్నదని కొంత నిరూపణ అయింది

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!