బంగారూ… ఏరీ నా భక్తులు?


గతంలో సత్యసాయి పుట్టినరోజంటే లక్షలాది మంది భక్తులతో పుట్టపర్తి కిటకిటలాడేది. కానీ బాబా మహానిర్యాయణం అనంతరం ఇప్పుడు అక్కడ సందడి తగ్గిపోయింది. విదేశీ భక్తుల రాక కూడా తగ్గింది. సత్యసాయి బాబా తన ప్రసంగాలతో కోట్లాది మంది భక్తులను ఆకర్షించేవారు.  పుట్టపర్తి ఓ ఆద్యాత్మిక బోధనలకు వేదికగా విరాజిల్లింది.

కానీ, బాబా భౌతికంగా లేకపోవడంతో ఆయన మాటలు, సూక్తులు ప్రత్యక్షంగా వినాలనుకునేవారిలో నిరుత్సాహం చోటుచేసుకుంది. తిరుపతి, షిర్డీల్లాగా పుట్టపర్తి ఓ పుణ్యక్షేత్రంగా విరాజిల్లలేకపోతోంది. చాలా మంది భక్తులు పుట్టపర్తిని ఓ ఆధ్యాత్మిక గురువు బోధనానిలయంగా భావిస్తుండటమే ఇందుకు ప్రధానకారణం. మున్ముందు భక్తుల తాకిడీ మరింతగా తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఏడాదిలో ఎంత మార్పు? నవంబర్ వచ్చిందంటే జన సమూహాలతో క్రిక్కిరిసిపోయే పుట్టపర్తి పట్టణం ఇప్పుడు వెలవెలబోతోంది. సత్య సాయి బాబా జన్మదినానికి ప్రపంచమంతటి నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చేవారు. సత్య సాయిబాబా అస్తమయం తర్వాత ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏవి బాబా నిరుడు కురిసిని హిమసమూహములు అని అనుకోవాల్సి వస్తోంది. క్రిక్కిరిసిపోయే పుట్టపర్తి వీధులు బోసిపోతున్నాయి. బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్ ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. వ్యాపారుల పంట పండపండేది. ఇప్పుడు అసంతృప్తితో వేగిపోతున్నారు. వ్యాపారం సాగడం లేదు. ఒక్క సత్య సాయిబాబా లేకపోవడమనేది పుట్టపర్తి ముఖచిత్రాన్నే మార్చేసింది. ప్రశాంతి నిలయంలోని వందలాది గదులతో పాటు పుట్టపర్తిలో దాదాపు 400 లాడ్జీలున్నాయి. బాబా జన్మదిన వేడుకల సందర్భంగా అవి నిండిపోయేవి. ఇప్పుడు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. పుట్టపర్తిలో, దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లేది. సత్య సాయిబాబా మరణం తర్వాత అది డీలా పడిపోయింది. సెంట్ భూమి లక్షలాది రూపాయలు పలికేది. ఇప్పుడు వాటిని కొనే దిక్కు లేకుండా పోయింది. ఒక‌ప్పుడు పుట్టప‌ర్తి ఓ వెలుగు వెలిగిపోయింది.. కానీ ఇప్పుడు దేవుడు లేని కోవెల‌లాగా బోసిపోయిక‌నిపిస్తుంది..

-ఎన్నార్టీ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!