ఫెమా, హవాలా చట్టాలంటే ఏమిటి?


ఈడీ, ఫెమా, మనీలాండరింగ్ వంటి మాటలు ఈమధ్య చాలా  తరచుగా వినబడుతున్నాయి. అసలు ఈ మాటలకు  అర్థాలేమిటీ…? వాటిని ఏ ఉద్దేశంతో వాడుతున్నారో,  వాటికున్న పరిధులేమిటో ఓసారి చూద్దాం.
ఆర్థిక పరమైన నేరాలను అదుపుచేయడం కోసం మనకు  బలమైన చట్టాలే ఉన్నాయి. నేరాలు రుజువయ్యే పక్షంలో  కఠిన శిక్షలు వేసే వీలు కూడా ఉంది. ఆర్థిక నేరాలు విదేశీ  ద్రవ్య నిర్వహణ పరిధిలో కూడా సాగుతున్నాయి.  అలాంటప్పుడే ఫెమా చట్టం ప్రాముఖ్యత  సంతరించుకుంటుంది. ఇంతకీ ఫెమా చట్టం అంటే ఏమిటి? విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం…దీనినే ఫెమా చ‌ట్టం అని అంటారు. విదేశాల్లో ఉన్న వ్యక్తికి అక్రమంగా నగదు బదిలీ చేసినా, విదేశీ సంస్థ నుంచీ అక్రమంగా నగదు తీసుకున్నా ఈ చ‌ట్టం క్రింద నేరం చేసిన‌ట్టవుతుంది. విదేశీయులు మనదేశంలో స్థిరాస్తులు కొనుగోలు  చేయడాన్ని కూడా ఈ చట్టం నిషేధిస్తుంది. ఈ చట్టం కింద కేసు నమోదైతేచాలు నిరపరాధి అని నిరూపించుకునే వరకు  దోషిగానే పరిగణిస్తారు. అంతేకాదు నేరనిర్ధారణ అయితే భారీ జరిమానా తోపాటు నేరంతో సంబంధం ఉన్న ఆస్తులు స్వాధీనం చేసుకుంటారు. జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష అమ‌లు చేస్తారు. హవాలా లావాదేవీలు నిరోధించడానికి మనదేశంలో  మనీ లాండరింగ్ నిరోధక చట్టం ఉంది. దీన్నే ప్రివెన్షన్ ఆఫ్  మనీ ల్యాండరింగ్ యాక్ట్ అంటున్నారు. అక్రమ మార్గాల  ద్వారా సంపాదించిన సొమ్మును చలామణిలోకి  తీసుకురావడాన్నే మనీ లాండరింగ్ అంటున్నారు. ఈ  చట్టంలో కొన్ని సవరణలు తీసుకురావడం కోసం ఉద్దేశించిన  బిల్లు కూడా ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే  ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనీ లాండరింగ్ ను నిరోధించడానికో చట్టం, హవాలా లావాదేవీలు అరికట్టే చట్టం, మనీ లాండరింగ్ తెలిసి చేసినా, తెలియకచేసినా తప్పే.. అక్రమ చలామణికి సహకరించినా తప్పే.. నేరం రుజువైతే కనీసం మూడేళ్ల కఠిన శిక్షతో పాటు భారీ స్థాయి జరిమానాలులు కూడా విధిస్తారు.
కేంద్ర ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగం పరిధిలో ఎన్ ఫోర్స్  మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది. దీన్నే ఈడీ అంటున్నారు.  ఫెమా, మనీ లాండరింగ్ నిరోధక చట్టాలను పక్కాగా  అమలుచేయడమే దీని పని. సంబంధిత సమాచారాన్ని  సేకరించడం, తనిఖీలు చేయడంతోపాటుగా నిందితులను  అరెస్టు చేసి, ప్రాసిక్యూట్ చేయడం వంటివి ఈడీ పరిధిలోకి  వచ్చే విధులు.
మొత్తం మీద, ఆర్థిక నేరాలను నిరోధించడానికి మనదేశంలో  చట్టాలు పటిష్టంగానే ఉన్నాయనే చెప్పాలి. ప‌టిష్టమైన చ‌ట్టాలు ఉన్నప్పటికీ వేల కోట్ల రూపాయ‌ల ఆర్థిక నేరాలు బ‌య‌ట‌ప‌డుతుండ‌డం మాత్రం శోచ‌నీయ‌మే..

-ఎన్నార్టీ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!