నేడు ప్రపంచ డ‌యాబెటిస్ డే


ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వ్యాధుల్లో డయాబెటిస్ చేరిపోయింది. చాలా సైలెంట్ గా మనిషి నవనాడులు క్రుంగదీస్తున్న మధుమేహ వ్యాధిపై అవగాహన పెంచడం కోసం ప్రతి ఏటా నవంబర్ 14న అంటే ఇదే రోజున ప్రపంచ డయాబెటిస్ అవగాహనా దినం పాటిస్తున్నారు.
చిన్నారుల దగ్గర్నించి పెద్దవాళ్లవరకూ అందర్నీ భయపెడుతున్న వ్యాధి మధుమేహం. దీన్నే డయాబెటిస్ మెల్లిటస్ అని అంటుంటారు. డయాబెటిస్ పై ప్రపంచమంతటా అవగాహరన కలిగించడంకోసమే ప్రతిఏటా నవంబర్ 14న  ప్రపంచ డయాబెటిస్ అవగాహన దినం పాటిస్తున్నారు. 1991 నుంచి ప్రపంచ డయాబెటిస్ అవగాహన దినాన్ని జ‌రుపుకుంటూ డ‌యాబెటిస్‌పై ప్రజ‌ల్లో అవ‌గాహ‌న తీసుకురావ‌డం ప్రారంభించారు. 2007లో దీనిపై ఐక్యరాజ్యసమితి సాధికారిక గుర్తింపునిచ్చింది. దాదాపు 160 దేశాల్లో పాటిస్తున్న డయాబెటిస్ అవగాహన దినం
మధుమేహం వ్యాధిపై అవగాహన పెంపొందించి, భయాలు పోగట్టడానికి అనేక దేశాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం వేలాది స్వచ్చంధ సంస్థలు ఇదే రోజున డయాబెటిక్ రన్, వాక్ సైకిల్ రేస్ వంటివి నిర్వహిస్తున్నారు. వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలు, సరికొత్త ప్రయోగాలతో ముడిపడిన అనేక సదస్సులు, గోష్ఠులు కూడా నిర్వహిస్తున్నారు.
దీనిపై ఒక్కో సంవ‌త్సరం ఒక్కో నినాదంతో నిర్వాహ‌కులు ముందుకు సాగుతున్నారు.. 2005 – డయాబెటిస్, పాదాల రక్షణ, 2006 -  వ్యాధి వ్యాప్తి తీరు, 2007-08 -  పిల్లల్లో మధుమేహం, 2009 – 2013  -  సంపూర్ణ అవగాహన, వ్యాధి నిరోధక  చర్యలు నినాదాల‌తో కార్యక్రమాలు చేస్తున్నారు.
వరల్డ్ డయాబెటిస్ డే  కోసం ప్రత్యేకంగా ఒక లోగో కూడా తయారు చేశారు. ఇది నీలిరంగులో ఉన్న వలయం. ఈ లోగోను 2007లో ఏకగ్రీవంగా స్వీకరించారు. అయితే ఈ లోగో రూప‌క‌ల్పన‌లో ఓ విశిష్ఠత ఉంది.. అదేమిటంటే.. నీలి వలయం ప్రశాంతతకు చిహ్నం, ఇది మెరుగైన జీవనానికీ, ఆరోగ్యానికి ప్రతీక ఇది ఆకాశ నీలం, దేశాల మధ్య ఐక్యతకు గుర్తు ఐక్యరాజ్యసమితి పతాకంలోని రంగు వీట‌న్నిటి మేళ‌వింపుతో లోగోని రూపొందించారు.
ప్రపంచ అవగాహన దినోత్సవాన్ని ప్రతిఏటా పాటిస్తుండటంతో కొంతలో కొంత చైతన్యం కలిగుతుందనే చెప్పాలి. అయితే, పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పడటానికి మరికొంతకాలం పట్టొచ్చు. మరి ఆ శుభఘడియకోసం ఎదురుచూస్తూ, ప్రపంచ మధుమేహ అవగాహన దినం పాటిద్దాం.

-ఎన్నార్టీ

9885292208

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!