దాడుల‌తో తెలంగాణ వ‌స్తుందా..?


తెలంగాణవాదం పేరుతో కొంతమంది దౌర్జన్యాలు చేయడం వల్ల ఆ వాదం బలహీన పడుతుందేకాని బలపడుతుందా అన్నది సందేహం. సమైక్యవాదిగా ఉన్న విశాలాంధ్ర మహా సభ నాయకుడు పరకాల ప్రభాకర్ పై టిఆర్ఎస్ కు చెందిన కొందరు చేయిచేసుకున్నట్లు వచ్చిన సమాచారం చూస్తే కేవలం పరకాల ప్రభాకర్ సమైక్యవాదం వినిపించినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ఆగిపోతుందా అన్న ప్రశ్న వస్తుంది. ఏకంగా ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణను ఇప్పుడున్న పరిస్థితులలో ఇవ్వలేమని చెప్పినప్పుడు దానికి టిఆర్ఎస్ బలంగా తన వాణిని వినిపించాలి కాని, వ్యతిరేక వాదనలు చేసేవారిపై దాడికి దిగడమో, ఇంకెవరూ హైదరాబాదులో మాట్లాడ రాదన్న నియంతృత్వ ధోరణి ప్రదర్శించడం వల్ల వారి లక్ష్యానికి విఘాతం కలుగుతుంది. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ బాగో,జాగో నినాదం ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో నివసిస్తున్న వేరే ప్రాంతంవారిలో భయాలు ఏర్పడ్డాయి. తెలంగాణ ఇచ్చాక కూడా ఇలాంటి గొడవలు జరిగితే తమను రక్షించేదెవరన్న భయం ఏర్పడింది. దానికి తగినట్లుగానే కొంతమంది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడకపోతే నేరం అన్నభావన పోవలసిన అవసరం ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!