మాన‌వ హ‌క్కుల చైర్మన్‌గా జ‌స్టిస్ క‌క్రూ


రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా జస్టిస్ కక్రూ పేరును ప్రభుత్వం ప్రతిపాదించగా, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు మద్దతు ఇచ్చారు. ఈ విషయాన్ని సచివాలయంలో చంద్రబాబు వెల్లడిస్తూ జస్టిస్ సుదర్శనరెడ్డి పేరు పరిశీలనలో ఉందని వార్తలు వచ్చాయని, అయితే ఆయన ఆ పదవికి సుముఖంగా లేరని ఖండనలు వచ్చాయని,దానితో కక్రూ పేరు ప్రతిపాదనకు వచ్చిందని, అందువల్ల తాము కూడా ఇటీవలే రిటైరైన కక్రూ ను మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ గా నియమించడానికి అంగీకారం తెలిపామని ఆయన అన్నారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఆస్తుల కేసులో సిబిఐ విచారణకు హైకోర్టు ఛీప్ జస్టిస్ గా కక్రూనే ఆదేశాలు ఇచ్చి సంచలనం సృష్టించారు. మైనార్టీవర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల ఆయనకు మద్దతు ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. కాగా ఈయన కాశ్మీర్ కు చెందిన కావడం మరో విశేషం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!