యాచ‌కులంతా అక్కడివారే..


కాంగ్రెస్ నాయకుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఎంత బిజీగా ఉంటాడో అందరికి తెలిసిన విషయమే. మరి ఈయన బిచ్చగాళ్ళను ఇంటర్వూ ఎప్పుడు చేశాడనే సందేహం మీకు కలగ వచ్చు. రాహుల్ నిజంగానే ఢిల్లీలో ఉన్న బిచ్చగాళ్ళను ఇంటర్యూ చేశాడు. రాహుల్ గాంధీ బిచ్చగాళ్ళను ఇంటర్వూ చేయడం ఏంటని అనుకుంటున్నారా ? మరేం లేదండి. వచ్చే ఏడాది ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. ఇందుకోసం యూపీలో 5 రోజుల ప్రచారం రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ యాత్ర కైసర్ గంజ్, బహ్రయిచ్ లలో జరిగింది. ఈయాత్రలో ఆయన మాయావతి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ… సొంత రాష్ర్టంలో ఉపాది కరువై యుపీ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో యాచకులుగా జీవిస్తున్నారని, రాజకీయ నాయకులు తమ కారు అద్దాలను దించి చూడాలి. అప్పుడే నాయకులకు వారు కనిపిస్తారని అన్నారు. ప్రస్తుతం నేను అదే పని చేశాను కాబట్టే నాకు తెలిసిందని వ్యాఖ్యానించారు. ‘నేను ఢిల్లీ వీధుల్లో ఎంతో మంది యాచకులను చూశాను. వారిని నేను మీరు ఎక్కడి నుండి వచ్చారని అడిగితే… తాము ఉత్తర ప్రదేశ్ నుండి వచ్చామని, ఆ రాష్ట్రంలో పనులు దొరకనే ఇక్కడికి వచ్చి యాచిస్తున్నామని నాకు చెప్పారని రాహుల్ అన్నారు. దేశం బెంగుళూరు, హైదరాబాద్ నగరాలు ఐటీ రంగంలో దూసుకుపోతున్నాయి. అభివ్రుద్ధి విషయంలో పంజాబ్, హర్యానా, కేరళ వైపు చూస్తుంది. మరి పంజాబ్ కి పరిస్థితి మారాలంటే రాష్ట్రానికి పట్టిన శనిని వదిలించాలంటే ఈ ప్రభుత్వాన్ని మార్చాలని పిలుపు నిచ్చారు. మరి రాహుల్ గాంధీ తాను ప్రధానమంత్రి కుర్చీ వచ్చే ఎన్నికల్లో దక్కించుకోవడం కోసం ఎలాంటి మాటలైన అంటాడని, యూపీ ప్రజలను బిచ్చగాళ్ళు అన్న రాహుల్ రేపు ప్రధాని అయ్యాక భారతదేశం మొత్తం బిచ్చగాళ్ళని పక్కదేశంలో అంటాడని కొందరు విమర్శిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!