అసెంబ్లీ భద్రతపై స్పీకర్ సమీక్ష
డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ దినేష్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ, నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్, ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ ఆనంద్ హాజరయ్యారు.
సమీక్ష అనంతరం ఏకేఖాన్ మీడియాతో మాట్లాడుతూ శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సభలు, సమావేశాలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలకు కూడా పటిష్ట బందోబస్తు ఉంటుందని ఏకే ఖాన్ తెలిపారు.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి