భాగ్యన‌గ‌రంలో బాల‌ల చిత్రాలు


హైదరాబాద్‌లో జరగనున్న 17వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చిత్రాలను ప్రదర్శించేందుకు శిల్పారామంలో మూడు తాత్కాలిక థియేటర్లను నిర్మించారు. 37 దేశాలకు చెందిన 152 చిత్రాలను ప్రదర్శించేందుకు భాగ్యనగరంలో 13 థియేటర్లను ఎంపిక చేశారు.
ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం నుంచి 20 వరకూ లలిత కళాతోరణంతోపాటు ఎంపిక చేసిన వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. గచ్చిబౌలిలోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఇండియా చైర్‌పర్సన్ నందితాదాస్, మంత్రి డి.కె. అరుణ తదితరులు కార్యక్రమానికి హాజరవుతారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!