ఓఎంసీ కేసులో 2న చార్జిషీట్ దాఖలు!


ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో వచ్చేనెల 2వ తేదీన సీబీఐ చార్జిషీటు దాఖలు చేయనుంది. అభియోగ పత్రాలతోపాటు అనుబంధ డాక్యుమెంట్లతో కలిపి సుమారు పదివేల పేజీలతో కూడిన 20 వాల్యూమ్స్‌ను కోర్టుకు సమర్పించ నున్నారు. ఈ కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేసిన తరువాత సెప్టెంబర్ ఐదో తేదీన సీబీఐ దర్యాప్తు పునఃప్రారంభమైంది. వెంటనే ఓఎంసీ యజమాని గాలి జనార్ధన్‌రెడ్డి, ఎండీ శ్రీనివాసరెడ్డిలను సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత గనుల శాఖ మాజీ ఎండీ రాజగోపాల్, ఐఏఎస్ అధికారిణి వై,శ్రీలక్ష్మి కూడా అరెస్టయ్యారు. వచ్చే నెల 4వ తేదీలోగా చార్జిషీటు సమర్పించాల్సి ఉంది. గడువుకు రెండు రోజులు ముందుగానే చార్జిషీటు దాఖలు చేయనున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!