బాబు ద్విముఖ వ్యూహం


ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు తన ఆస్తుల కేసులో ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారు.ఒకవైపు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వేసిన పిటిషన్ లో పేర్కొన్న అంశాలన్నీ అసత్యాలేనని విస్తారంగా ప్రచారం చేయించడం, మరోవైపు కోర్టుల ద్వారా పోరాటం చేయడం అనే వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నట్లు కనబడుతుంది. సుప్రింకోర్టుసూచన మేరకు చంద్రబాబు, లోకేశ్వరి, లోకేష్ లు హైకోర్టులో తమ వాదనలు వినాలంటూ పిటిషన్ వేయడం ఒక కోణం కాగా, మరో వైపు విజయమ్మ వేసిన పిటిషన్ లోని అంశాలను ఒక్కొక్కదానిని ఖండిస్తూ , తమ పార్టీ నేతలతో ప్రచారంలో పెట్టడం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ వరస క్రమంలో రోజూ కొంతమంది టిడిపి సీనియర్ నాయకులతో విజయమ్మ పిటిషన్ లోని అంశాలపై సమాధానం ఇప్పిస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు ఇ. పెద్దిరెడ్డి శుక్రవారం నాడు తాము విజయమ్మపై పరువు నష్టం వేసే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నామని ప్రకటించం కూడా ఇందులో భాగంగానే భావించాలి.విజయమ్మ అన్ని అసత్యాలతో పిటిషన్ వేశారని ,అందువల్ల తాము పరువు నష్టం దావా వేస్తామని ఆయన చెప్పారు. కాగా రామోజీరావు వేసిన పటిషన్ పై వచ్చే నెల ఐదున విచారణ జరుపుతామని హైకోర్టు ప్రకటించడం విశేషం. దీనివల్ల వీరికి వెంటనే రిలీఫ్ రాని పరిస్థితి ఏర్పడింది. సిబిఐ ఈలోగా విచారణ ఆరంభిస్తే అప్పుడు స్టే లభిస్తుందా అన్నది సందేహంగా ఉంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!