వైభవంగా పంచమి తీర్థ మహోత్సవం


తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం పంచిమ తీర్థ మహోత్సవం మంగళవారం మధ్యాహ్నం వైభవంగా జరిగింది. ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు కుంభ లగ్నంలో జరిగిన చక్రస్నానానికి లక్షలాది భక్తులు తరలి వచ్చారు.
బ్రహ్మోత్సవాలలో చివరిది, ముఖ్యమైన ఘట్టం పంచమి తీర్థం(చక్రస్నానం). అమ్మవారి పద్మసరోవరం(పుష్కరిణి)లో జరిగే పంచమి తీర్థం మహోత్సవం అత్యంత విశిష్టమైనది. ఈ మహోత్సవం రోజున పద్మసరోవరంలో పుణ్యస్నానమాచరిస్తే సకల పాపాలు తొలగి, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
కార్తీక మాసం శుక్ల పక్షం, పంచమి తిథి, ఉత్తరాషాడ నక్షత్రంలో అమ్మవారు స్వర్ణకమలంలో అనంత సూర్యకాంతులతో స్వామివారిని అనుగ్రహిస్తారు. ఈ పంచమి తీర్థం రోజున తిరుమల నుంచి అమ్మవారికి సారె (తులసి, కుంకుమ, పసుపు, పట్టుచీర, పణ్యారం, అన్నప్రసాదం)తదితర వాటిని ఏనుగులపై ఊరేగింపుగా తిరుచానూరుకు తీసుకొచ్చి ఆలయ మర్యాదలతో అందజేస్తారు.
శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించిన ఈ పద్మ సరోవరంలో ప్రతి ఏడాది నిర్వహించే పంచమి తీర్థం(చక్రస్నానం)కు స్వయంగా స్వామివారు వచ్చి ఇక్కడ అమ్మవారికి జరిగే పూజాది కార్యక్రమాలను తిలకిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే చక్రస్నానం జరిగేంతవరకు తిరుమలలో స్వామి వారికి పూజలు నిర్వహించరు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!