కాదేదీ వివాదానికి అన‌ర్హం..


కాదేదీ వివాదానికి అన‌ర్హం.. అన్నది అక్షరాలా పాటిస్తాడు వివాదాలంటే ఎంతో ఇష్టప‌డే ద‌ర్శకుడు రాం గోపాల్ వ‌ర్మ. శ్రీ‌రామ‌రాజ్యం హిట్ కావ‌డంతో తాను కూడా తీస్తాన‌ని తన స్టయిల్ లో రామాయణం తీస్తాన‌ని, నా రామయణం త్రేతాయుగం నాటిది కాదంటూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ వైపు బాలయ్య నటించిన ‘శ్రీరామ రాజ్యం’ సినిమా హిట్ టాక్ తో దూసుకెలుతున్న నేపథ్యంలో టింగరి వేషాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వర్మ చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇందంతా ఒక ఎత్తయితే ఈ సినిమాలో ప్రముఖ హీరో నాగార్జునతో విలన్ రావణ్ రాజు పాత్ర వేయిస్తానంటూ మరో సంచలనానికి తెరలేపాడు వర్మ. ఈ విధంగా తాజాగా ఫిల్మ్ నగర్ లో వర్మ హాట్ టాపిక్ అయ్యారు. కాగా….వర్మ తీయబోతున్న రామయణంపై వరంగల్ జిల్లాకు చెందిన న్యాయవాది కోర్టుకెళ్లారు. ఆయన కోర్టుకెళ్లడానికి కారణం ‘రామయణం’ అనే టైటిలే. వర్మ చెప్పిన ఈ చిత్రం కథ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, అలాంటి కథనకు హిందువులు పవిత్రంగా భావించే ‘రామయణం’ పేరు పెట్టడం సరికాదని, వెంటనే టైటిల్ మార్చాలంటూ సత్యప్రకాష్ అనే న్యాయవాది హైకోర్టు రిజిస్ట్రార్ కు పిర్యాదు చేశారు. వర్మకు కూడా లీగల్ నోటీసులు పంపారు. రామయణం పేరు మీద సినిమా నిర్మించడానికి వర్మకు అనుమతి ఇవ్వ వద్దని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!