రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల‌లో భ‌యం..


తెలంగాణ కోసం రాజీనామాలు చేశాం, అందరూ రాజీనామా చేయాల్సిందే , వాటిని స్పీకర్ ఆమోదించాల్సిందే అని గట్టిగా వాదిస్తున్న కొంతమంది శాసనసభ్యులు తీరా తమ రాజీనామాలు ఆమోదించే సమయం వచ్చేసరికి ముఖం చాటేస్తున్నారు.  తెలుగుదేశం ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విమర్శించే కొంతమంది సభ్యులు సైతం ప్రస్తుతానికి అదే పంధాను కొనసాగిస్తున్నారు. పార్టీలు వదలి తెలంగాణ కోసం రాజీనామా చేశామని ప్రకటించిన హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారి, జోగు రామన్న, డాక్టర్ రాజయ్య, సోమారపు సత్యనారాయణ, మాజీ మంత్రి జూపల్లె కృష్ణారావులను స్పీకర్ కార్యాలయం రాజీనామాల ఆమోదం విషయమై మాట్లాడేందుకు రావల్సిందిగా కోరింది. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాత్రం వచ్చి వెళ్లారు. మిగిలినవారిలో కొందరు రకరకాల కారణాలు చూపుతూ తర్వాత స్పీకర్ ను కలుస్తామని దాట వేస్తున్నట్లు సమాచారం వస్తోంది. కొందరు పార్టీ ఇచ్చిన పాదయాత్రలలోబిజీగా ఉన్నామని, మరికొందరు వేరే పనులలో ఉన్నామని చెబుతూ తప్పుకున్నారని అంటున్నారు. ఇంతకాలం రాజీనామాలను ఆమోదించకపోతే స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను విమర్శించిన కొంతమంది ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు ఆయన పిలుపునకు దూరంగా ఉండాలని అనుకోవడం విశేషం. ప్రధానంగా ఎన్నికలు వస్తే ఖర్చుపెట్టవలసిన డబ్బు గురించి, ఆరు నెలలపాటు పదవి లేకుండా ఉండాల్సి రావడం,ఈ ఆరు నెలల్లో ఏమవుతుందో తెలియని పరిస్థితి వంటివి కారణాలుగా కన్పిస్తాయి.నాదెండ్ల మనోహర్ బుధవారం నాడంతా తన కార్యాలయంలో అందుబాటులోనే ఉన్నప్పట్టికీ ఎవరూ అటు వైపు రాకపోవడం విశేషం.ఒకప్పుడు స్పీకర్ శాసనసభకు రాకుండా విదేశాలలో ఎక్కువగా గడుపుతున్నారన్న అబియోగం ఉండగా, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆ సమస్యలో ఇరుక్కోవడం రాజకీయ వైచిత్రిగా పరిగణించవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!