విషం చిమ్మే సలాడ్స్!


`ఆరోగ్యంకోసం సలాడ్స్ తింటే ప్రాణాలమీదకొచ్చిం’ దన్నది కొత్త సామెత కాదు. జాతీయ పౌష్ఠికాహార సంస్థ ఈ మధ్య జరిపిన సర్వేలో తేలిన నిజం ఇదే.  హైదరాబాద్ వీధుల్లో అమ్మే సలాడ్స్ పై ప్రాణాంతక రోగ క్రిములుంటున్నాయని స‌ర్వేలు తేల్చి చెబుతున్నాయి.
ఆరోగ్యంగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. మరీ ముఖ్యంగా వాతావరణ కాలుష్యంతో రోజూ మగ్గిపోయే నగరవాసుల్లో హెల్త్ ఎవేర్ నెస్ ఎక్కువగానే ఉంటుంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికాఅన్నట్టు నగరాల్లో వెజిటబుల్ సలాడ్స్ అమ్మకం జోరుగాసాగిపోతోంది. అయితే, వెజ్ సలాడ్స్ తింటే ఆరోగ్యం సంగతేమోగానీ, నయంకాని రోగాలు వచ్చే అవకాశాలున్నాయట.
హైదరాబాద్ రోడ్లపై అమ్మే వెజ్ సలాడ్స్ తింటే మాయదారి రోగాలు వస్తాయని 106 సలాడ్ శాంపుల్స్ ను పరీక్షించిన తర్వాత తేలిన నిజం. వీటిలో 55 శాంపుల్స్ కలుషితమైనవే. క్యారెట్ ముక్కల్లో 98 శాతం వ్యాధిక్రిములతో కలుషితమైపోయాయి. అంతేకాదు, 75 శాతం ఆనియన్ ముక్కల పరిస్థితి ఇంతే.
ఎందుకిలా జరుగుతోందని అనుకుంటున్నారా ! ప్రెష్ కూరగాయలు తింటే మంచిదే. అవి మేలు చేస్తాయి. కానీ అలా జరగడంలేదు.  చాలామంది సలాడ్ వ్యాపారులు కూరగాయలను సరిగా వాష్ చేయడంలేదు. ఇదే పెద్ద సమస్య. దీంతో మనం తినే సలాడ్ తో పాటుగా  ప్రాణాంతక బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి.
ఆరోగ్యం బాగుపడుతుందని సలాడ్స్ తినేవారు ఇకపై జాగ్రత్తగా ఉండటం మేలు. ఎక్కడపడితే అక్కడ సలాడ్స్ తినేస్తే ఆ తర్వాత ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.

‍‍‍‍‍‍‍‍‍-ఎన్నార్టీ

కామెంట్‌లు

  1. కూరగాయలు బాగా కడిగితే వాళ్ళకే డబ్బులు ఖర్చు. ఖర్చు ఎక్కువ పెట్టి ఎక్కువ ధరకి అమ్మితే కస్టమర్లు కొనరు కదా. అందుకే సరిగా కడగని కూరగాయలతో వండేస్తారు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!