నేడు సత్యసాయి 86వ జయంతి వేడుకలు


పుట్టపర్తిలో సత్యసాయి బాబా 86వ జయంతి వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాలులో బాబా మహా సమాధి వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు తమిళనాడు గవర్నర్ రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మల్లాది సోదరులు రూపొందించిన బాబా భక్తి గీతాలు ‘హృదయవీణ’ సీడీని ఆవిష్కరించారు. సత్యసాయి జయంతి వేడుకలకు రాష్ట్ర మంత్రులు గీతారడ్డి, రఘువీరారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి హాజరయ్యారు. కాగా వేడుకలను కవర్ చేసేందుకు వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అనుమతి నిరాకరించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!