ఫామ్‌హౌజ్‌లో చ‌ర‌ణ్ నిశ్చితార్థం


చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తేజ్, అపోలో గ్రూప్ చైర్మన్ సి. ప్రతాప్‌రెడ్డి మనవరాలు ఉపాసనల నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ రెవెన్యూ పరిధిలోని అపోలో ఫాంహౌస్‌లో డిసెంబర్ 1న రామ్‌చరణ్ తేజ్-ఉపాసనల నిశ్చితార్థం జరుగనుంది. ఇందు కోసం 20 రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరొక రోజే సమయం ఉండటంతో మిగిలిన చిన్నచిన్న పనులను ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే ఫాంహౌస్‌లో 30 ఎకరాల స్థలాన్ని చదునుచేశారు. నిశ్చితార్థ వేదికను భారీ సెట్టింగులతో ఏర్పాటు చేస్తున్నారు. రెండు వేల మంది వీఐపీలు హాజరవుతారన్న అంచనాతో ఏర్పాట్లు చేశారు.
చరణ్ నిశ్చితార్థానికి దేశంలోని నలుమూలల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు తరలిరానుండడంతో వేదిక అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర ఉండాలనే ఆలోచనతో అపోలో ఫాంహౌస్‌ను ఎంచుకున్నట్లు మెగా ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు. వీఐపీలు భారీగా వస్తుండడంతో వాహనాల పార్కింగ్‌కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!