రామోజీపై ఉండ‌వ‌ల్లి ఫైర్‌


చాలాకాలం తర్వాత ఈనాడు అధినేత రామోజీరావు, రాజమండ్రి లోక్ సభ సభ్యుడు ఉండవల్లి అరుణకుమార్ ల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. రామోజీకి చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉండవల్లి ఫిర్యాదు చేయడం, దానిపై ఇంతకాలంగా కేసులు జరగుతుండడం తెలిసిన సంగతే. అయితే వై.ఎస్. మరణానంతరం ఈ గొడవ కాస్త తగ్గుముఖం పట్టింది.కాగా ఉండవల్లి అరుణకుమార్ తాజాగా హైకోర్టుకు వేసిన పిటిషన్ లో రామోజీ తాను మార్గదర్శి చిట్‌ ఫండ్ సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తున్నానని పేర్కొన్నారని, , దీనిలోతప్పుడు సమాచారం ఉందని ఉండవల్లి ఆరోపించారు. దీనిపై రామోజీని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించాలని ఆయన కోరారు. కాగా దీనికి ప్రాతిపదికగా అంతకు ముందు మార్గదర్శి ప్రతినిది బాలాజీ రెండువేల ఎనిమిదిలో తనపై వేసిన వ్యాజ్యంలో మార్గదర్శి చిట్ ఫండ్ వ్యాపారాన్ని రామోజీ నిర్వహిస్తున్నారని అనడంలో వాస్తవం లేదని పేర్కొన్నారని,ఇది రామోజీ ఆమోదంతో ఇచ్చిన ప్రమాణ పత్రంగా తెలిపారని, రెండిటి మధ్య వైరుద్యం ఉందని, కనుక చట్టపరంగా చర్య తీసుకోవాలని అరుణకుమార్ కోరారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!