విండీస్ పై భార‌త్ సంచ‌ల‌న విజ‌యం


వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఒక వికె ట్ తేడాతో విజయం సాధించింది. 212 పరుగులు విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు మిడిల్ ఆర్డర్‌ను రోచ్, రస్సెల్ కుప్పకూల్చారు. ఓదశలో 159 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును రోహిత్ శర్మ, వినయ్ కుమార్‌లు లక్ష్యం వైపు నడిపించారు. విజయానికి 12 కావాల్సివుండగా రోహిత్ శర్మ 72 పరుగులు చేసి సమీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత యాదవ్‌తో ఆరోన్ కలిసి విజయానికి కావల్సిన పరుగుల్ని ఇంకా ఏడు బంతులుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. యాదవ్ 6, ఆరోన్ 6 పరుగులుతో నాటౌట్‌గా మిగిలారు. విండీస్ బౌలర్లలో రోచ్ 3, రస్సెల్ 2, మార్టిన్, సమీ, పొలార్డ్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టులో బ్రావో అత్యధికంగా 60, హ్యాత్ 31 పరుగులు చేశారు. యాదవ్, ఆరోన్‌లు రెండేసి వికెట్లు, వినయ్, అశ్విన్, జడేజా, రైనాలు చెరో వికెట్ పడగొట్టారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!