రామోజీరావుకి సంబంధం లేదు..


శంషాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి భూముల సేకరణలో ఎలాంటి అవకతవకలు లేవని సిబిఐ గతంలోనే నివేదిక ఇచ్చిందని, దానిని విస్మరించి శంషాబాద్ భూములను వివాదాస్పదం చేస్తూ వై.ఎస్.విజయమ్మ పిటిషన్ వేసిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు , శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ చేసిన విమర్శను, అలాగే సిబిఐ నివేదికలోని అంశాలను ఈనాడు బ్యానర్ కధనంగా ఇచ్చింది. తాను పీకలోతు బురదలో కూరుకుపోయి, ఇతరులపై కూడా అదే విధంగా బురదజల్లాలని చూస్తున్నారని కూడా ఆరోపించారు.కాగా కేశవ్ మాట్లాడుతూ శంషాబాద్ విమానాశ్రయం ఏర్పాటుకు 1998లోనే జి.ఓ విడుదల అయితే రామోజీరావు 2001లో అంటే మూడేళ్ల తర్వాత భూములు కొనుగోలు చేశారని వెల్లడించారు. అందువల్ల శంషాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు , రామోజీరావు భూముల కొనుగోలుకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓఎమ్సి గనుల లీజు కు సంబంధించి నోట్ ఫైల్ పై సంతకం చేసిన విషయం బయటపడిందని, దీంతో ఆమె సంకటంలో పడ్డారని అంటూ మరో కధనాన్ని ఈనాడు ఇచ్చింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!